టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి రెండు సినిమాల గొప్ప విజయాలతో జాతీయస్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా హీరోగా ఎంతో గొప్ప పేరు, మార్కెట్ వేల్యూ ని ఏర్పరుచుకున్నారు. ఇక సినిమాల తరువాత రన్ రాజా రన్ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహో. అత్యంత భారీ బడ్జెట్ తో పాటు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్, యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ కానప్పటికీ, అటు హిందీలో మాత్రం కలెక్షన్స్ దుమ్ము దులిపింది. సాహో దెబ్బకు అక్కడ ప్రభాస్ ఇమేజ్ మరింతగా పెరిగింది అనే చెప్పాలి.

IHG

ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. పూజ హెగ్డే హీరోయిన్ గా గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలపై యువి కృష్ణంరాజు సమర్పణలో ఎంతో భారీ బడ్జెట్ తో తెరెక్కుతున్న ఈ సినిమాకు కూడా పలువురు అగ్ర టెక్నీషియన్లతో పాటు పలువురు భారీ స్టార్ క్యాస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న అధికారికంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ పోస్టర్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది 1.2 మిలియన్ల లైక్స్ దక్కించుకోవడం జరిగింది. 

 

అలానే మరోవైపు రాధే శ్యామ్ పేరుతో హ్యాష్ టాగ్, గడచిన 24 గంటల్లో ఏకంగా 6.3 మిలియన్ల ట్వీట్స్ సాధించి ట్విట్టర్ లో సరికొత్త రికార్డు ని సృష్టించింది. వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటినుడో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక్కసారిగా నిన్న ఫస్ట్ లుక్ బయటకు రావడంతో, తమ అభిమాన హీరో ప్రభాస్ ఫ్యాన్ పవర్ ని వారందరూ ఈ విధంగా మిగతా ప్రేక్షకులందరికీ తెలిసేలా చేసారు అనే చెప్పాలి. ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: