తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరో, హీరోయిన్లు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 90వ దశకంలో హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు. తలంబ్రాలు చిత్రంలో విలన్ గా నటించిన రాజశేఖర్ తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట పలు చిత్రాల్లో నటించారు.  ఆ తర్వాత జీవిత దర్శకత్వ, నిర్మాణ రంగంలోకి వచ్చారు. ఆ మద్య వరుసగా రాజశేఖర్ నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీకి చాలా కాలం పాటు దూరంగా ఉంటూ వచ్చారు. ఒక దశంలో రాజశేఖర్ మళ్లీ విలన్ అవతారం ఎత్తుతారని.. జగపతిబాబు బాటలో నడుస్తారని అన్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. 

IHG

ఆ మద్య మళ్లీ గరుడవేగ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తర్వాత కల్కి చిత్రంలో నటించారు. టాలీవుడ్ లో  జీవిత, రాజశేఖర్ లది ఒక అన్యోన్యమైన జంట అంటారు. వాస్తవానికి తలంబ్రాలు చిత్రం తర్వాత వీరి ప్రేమించుకున్న విషయం పెద్దలకు చెప్పినా ఒప్పుకోలేదట.. మొత్తానికి నానా తంటాలు పడి...  వారిని ఒప్పించారు.

IHG

1991 జులై 10న చెన్నైలో వీరు పెళ్లి చేసుకున్నారు. నిన్నటితో వీరి వివాహం జరిగి 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లినాటి ఫొటోను రాజశేఖర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: