పిల్లలు ఎంత పెద్ద వారైనా తల్లిదండ్రులకు ఇంకా చిన్న పిల్లలు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ల మీద అమితమైన ప్రేమ చూపించడం, తప్పులు సరి చేయడం మామూలే. అదే వాళ్ళ దూరంలో ఉంటే ఎంత గానో మిస్ అవ్వడం అలానే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూడడం కూడా సహజం. అయితే నేడు మెగా యాక్టర్ నాగబాబు కూడా అలానే ఫీల్ అవుతున్నాడు. ఎమోషనల్ గా పలు వ్యాఖ్యలు చేసి తన పిల్లల కోసం చెప్పాడు. తన అనుభూతుల్ని తెలియజేస్తూ పలు విషయాలను చెప్పాడు నాగబాబు.

 

మెగాస్టార్ బ్రదర్ నాగబాబు తమ్ముడు పార్టీ లో తాను కూడా ఒక చెయ్యి వేసాడు. గతంలో జరిగిన ఎన్నికలకు ఈయనకి  పరాభవం ఎదురవడంతో ఇక ఎన్నికలకు పోటీ చేయనని తన బ్రదర్ చిరంజీవి చెప్పాడు అందుకే చేశాను అని చెప్పాడు. పోటీ చేయను కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటా అని చెప్పాడు. అలానే యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు జన సైనికులకు పార్టీ విషయాలు, అలాగే తనకు తోచిన విషయాలు కూడా చెప్తానని చెప్పాడు

 

ఇదిలా ఉండగా పర్సనల్ విషయాలు కూడా కొన్ని చెప్పాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముద్దుగా ఉన్న వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో లో నాగబాబు కూడా ఉన్నారు. ఆ ఫోటో లో నాగబాబు మాస్ లుక్ లో కనిపించారు. గడ్డంతో యంగ్ గా ఆయన ఉన్నారు. ఆ ఫోటోని పోస్ట్ చేసి వరుణ్ ఇప్పుడు  పెద్దవాడు అయ్యాడని తెలుసు కానీ హృదయం దానిని అంగీకరించడం లేదు. ఎంత ఎత్తు ఎదిగినా ఎప్పటికీ నాకు పసి బిడ్డలు అని చెప్పాడు నాగబాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: