టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరైన మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేడు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మొత్తంగా తన సినిమా కెరీర్ లో 180కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో పెద్ద, చిన్న అనే తేడాలేకుండా దాదాపుగా అప్పటి హీరోలందరికీ కూడా మ్యూజిక్ అందించి ఎంతో బిజీ బిజీగా మణిశర్మ కొనసాగేవారు. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OFFICE' target='_blank' title='office-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>office</a> burgled

ఇక ఆయన సాంగ్స్ కు అప్పటి ప్రేక్షకుల్లో ఎంతో మంచి క్రేజ్ ఉండేది. అప్పటి యువత, మాస్ ప్రేక్షకులను అలరించేలా ఎప్పటికప్పుడు సినిమా, సినిమాకు ప్రత్యేకంగా ట్యూన్స్ అందించిన మణిశర్మ, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో పెద్ద దిట్ట. ఒకరకంగా ఇప్పటివరకు టాలీవుడ్ లో పనిచేసిన సంగీత దర్శకులు అందరిలోకి, చాలా సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఆయా సినిమాల విజయాల్లో మణిశర్మ కీలక పాత్ర పోషించారు. ఇకపోతే ఆయన ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో కొన్ని సినిమాలు అయితే మరింత అద్భుత విజయాలు సాధించాయి. 

 

వాటిలో ప్రముఖంగా నిలిచినవి ఏవంటే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర, ఠాగూర్, నటసింహం బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు, అతడు, పోకిరి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, బాలు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆది, సాంబ, సినిమాలు నిలుస్తాయి అని చెప్పవచ్చు. కాగా వాటిలో ఇంద్ర, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఒక్కడు, పోకిరి, ఆది, ఖుషి సినిమాల బిజిఎమ్ మరింతగా ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళి ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ, ప్రస్తుతం పలు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: