గ్లామర్ ఉంటే చాలు ఛాన్సులు తన్నుకుంటూ వస్తాయన్న రోజులు పోయాయి. రకుల్ ను చూస్తుంటే.. ఈ విషయం స్పష్టమవుతుంది. సినిమాల్లో.. సోషల్ మీడియాలో.. బయట ఎక్కడికొచ్చినా.. ఒయ్యారాలు ఒలకబోసే రకుల్ పై ఫేడౌట్ ముద్ర ఎందుకు పడింది. తక్కువ టైమ్ లో స్టార్స్ పక్కన మెరిసి ఒక్కసారిగా ఎందుకు కనిపించకుండా పోయిందనే ప్రశ్న సినీ అభిమానుల్లో మెదులుతోంది. 

 

రకుల్ తెలుగమ్మాయి కాకపోయినా.. హైదరాబాదీ అని చెప్పుకుంటుంది. తెలుగు సినిమాలతో డబ్బులు సంపాదించి ఎఫ్ 45పేరుతో ఇక్కడే జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటోంది. ఎన్ని చేసినా.. రకుల్ కు మాత్రం ఛాన్సులు నిల్. అసలే ఆఫర్స్ లేకుండా సతమతమవుతుంటే.. కరోనా వచ్చి.. ఈ బ్యూటీని కోలుకోకుండా చేసింది. షూటింగ్స్ మొదలైనా.. ఈ అమ్మడికి ఛాన్సులు వస్తాయన్న గ్యారెంటీ లేదు. 

 

గ్లామర్ తో టాలీవుడ్ ను బొక్కాబోర్లా పడేసి.. స్టార్స్ అందరినీ తనవైపుకు తిప్పుకుంది రకుల్. కెరీర్ మొత్తం మీద అరకొర హిట్స్ తో అరడజను ఛాన్సులు వెనకేసుకొని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అధృష్టం మొహం చాటేయడంతో.. కళకళలాడిన కెరీర్ కాస్తా మసకబారింది. 

 

ఒకటా.. రెండా.. వరుస ఫ్లాపుల్లో కూడా రకుల్ దే రికార్డ్. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశ తప్పలేదు. రారండోయ్ వేడుక చూద్దాం.. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు 2తర్వాత ఇందులో పోషించిన పాత్ర అభిమానులకు కూడా నచ్చలేదు. 

 

కంటిన్యూస్ ఫ్లాపులు.. ఆఫర్స్ లేకపోయినా.. ఎప్పుడూ జనాలకు టచ్ లో ఉంటూనే ఉంది రకుల్. చేతిలో సినిమాల్లేక కావాల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా ఫోజులివ్వడం లేదంటే.. ఫిట్ నెస్ చాటున ఒయ్యారాలు ఒలకబోస్తూ.. కవ్వించాలని చూసినా.. తెలుగు హీరోలు ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. హిందీ, తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా.. తెలుగులో మాత్రం ఫేడౌట్ ముద్ర నుంచి బయటపడలేకపోతోంది రకుల్. మరి ఈ అమ్మడిని రక్షించే కథానాయకుడు ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: