స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేసినా సరే చాలా వరకు కూడా ఇప్పుడు సురేందర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకప్పుడు సురేందర్ రెడ్డికి మంచి డిమాండ్ అనేది ఉండేది. అయితే సైరా సినిమా తర్వాత ఏమైందో ఏమో గాని ఇప్పుడు దాదాపుగా ఆయనను ఎవరూ కూడా సినిమా చేయడానికి తీసుకోవడం లేదు అనే టాక్ వినపడుతుంది. అగ్ర హీరోలతో ఒక రేంజ్ సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి. స్టార్ హీరోలకు మంచి హిట్స్ ఇచ్చినా సరే ఆయనకు మాత్రం  ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఇప్పుడు మాత్రం దాదాపుగా పరిస్థితి అదే విధంగా ఉంది. ఆయనను మెగా ఫ్యామిలీ ఒకప్పుడు బాగా ఆదరించింది.  కాని ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ ఆయనను దాదాపుగా పక్కన పెడుతుంది అనే వ్యాఖ్యలు మనం వింటున్నాం. మరి కారణం ఏంటీ అనేది ఆయనకే తెలియాలి. ఇప్పుడు రెండు మూడు సినిమాలు ఆయన చేతి వద్దకు వచ్చినట్టే వచ్చి పోయాయి. వచ్చే ఏడాది ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు. మన స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఆయనను పక్కన పెడుతున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి మరి. 

 

ఇక ఆయన ఎప్పుడు సినిమాలు చేస్తారు ఏంటీ అనేది చూడాలి. టాలీవుడ్ లో ఆయనకు నిర్మాతలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు అని అంటున్నారు. ఇక తమిళ సినిమా ఒకటి చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఎప్పుడు ఆయన సినిమాలు చేస్తారు అనేది చూడాలి. రవితేజా తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి గాని అది నిజమా కాదా అనేది మాత్రం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: