టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇప్పుడు చేసే సినిమాల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. ఇక తమిళ సినిమాల్లో ఉండే వారిని కూడా తమ సినిమాల్లో ఉంచుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు అనే చెప్పాలి. మన తెలుగు లో స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఇతర భాషల హీరోల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తమిళ మార్కెట్ ని పెంచుకోవడమే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే మన హీరోలను మాత్రం తమిళ సినిమాల్లో అక్కడి వారు తీసుకోవడం లేదు. 

 

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు గాని ఇక్కడ వారిని మాత్రం తమ సినిమాల్లో తీసుకోకపోవడం పై చాలానే విమర్శలు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం. అగ్ర హీరోల సినిమాల్లో నటించే వారు కూడా ఇదే విధంగా ఉండటం తో మన స్టార్ హీరోలు కూడా ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అక్కడి వారిని తమ సినిమాల నుంచి ఇక పక్కన పెట్టడమే మంచిది ఆనే భావనకు వచ్చేశారు. చాలా వరకు కూడా  ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. తెలుగుని తమిళ హీరోలు వాడుకుంటున్నారు అని కాని అక్కడ మాత్రం మన సినిమాలు కనీసం కూడా చూసే వారు లేరు అనే అసహనం స్టార్ హీరోల్లో చాలా వరకు ఉంది. 

 

అందుకే ఇప్పుడు దాదాపుగా స్టార్ హీరోలను పక్కన పెట్టారు అని అంటున్నారు. విజయ్ సేతుపతి లాంటి వారిని కూడా ఇప్పుడు పక్కన పెట్టడమే మంచిది అనే భావన కు చాలా మంది వచ్చేశారు అని అంటున్నారు. మరి ఇది ఎంత కాలం ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. మహేష్ సినిమా నుంచి అరవింద్ స్వామిని తప్పించారు అని కూడా వార్తలు వస్తున్నాయి మరి. చూడాలి ఇక ఎం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: