ఆచార్య సినిమా విషయంలో చాలా  వరకు చిరంజీవి జాగ్రత్తగా ఉంటున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఆయన దాదాపుగా ఈ సినిమా కోసం రెండేళ్ళ నుంచి కష్టపడుతున్నారు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తనను తాను చాలా వరకు మార్చుకున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. స్టార్ హీరోలు చాలా వరకు ఇప్పుడు అందరూ ఇదే విధంగా తమ సినిమాల కోసం జాగ్రత్తగా తమను తాము మార్చుకునే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. ఇక చిరంజీవి సీనియర్ హీరో కావడం తో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాలో ఇప్పుడు చాల సన్నివేశాలను కట్ చేసారు అనే వార్తలు వస్తున్నాయి మరి. నిజమా కాదా అనేది తెలియదు గాని చిరంజీవి ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని రామ్ చరణ్ ఆ విధంగా ఆలోచన చేసాడు అని అంటున్నారు. చిరంజీవి వయసు మీద పడటం తో కాస్త అలసిపోయినట్లు ఉన్నారు అని అందుకే రామ్ చరణ్ ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అని అంటున్నారు. దాదాపు స్టార్ హీరోలు  అందరూ ఇదే విధంగా ఉన్నారు. సీనియర్ హీరోలు యాక్షన్ సీన్స్ ని ఆరోగ్యం దృష్టి లో పెట్టుకుని తగ్గించే ఆలోచనలో ఉన్నారు అనే కథనాలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ లో హడావుడి చేస్తుంది. దాదాపు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే సినిమాలు ఎక్కువ కాలం చెయ్యాలి అంటే కష్టపడే విషయంలో కాస్త వెనక్కు తగ్గాలి అని ఫిట్నెస్ ని పెంచుకోవాలి అని భావిస్తున్నారు. అందుకే చిరంజీవి విషయంలో రామ్ చరణ్ ఆ జాగ్రత్త తీసుకున్నాడు అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఏ విధంగా ఉంటుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: