ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే సినిమాల్లో చాలా వరకు కూడా ఖర్చు అనేది తగ్గించుకునే ఆలోచనలోనే సినిమా నిర్మాతలు దర్శకులు ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు ఇప్పుడు అదే విధంగా చాలా వరకు ఖర్చు అనేది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మన తెలుగు లో స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఖర్చు విషయంలో దాదాపుగా వెనక్కు తగ్గారు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. 

 

అది ఏంటీ అంటే... టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ఇతర భాషల నుంచి వచ్చే వారిని దాదాపుగా తీసుకునే అవకాశం లేదు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును ఇతర భాషల్లో ఎంత పాపులర్ నటుడు అయినా సరే పక్కన పెట్టే ఆలోచనలోనే దాదాపుగా ఉన్నారు అని అంటున్నారు. వారు భారీగా డిమాండ్ చేస్తే పక్కన  పెట్టడమే మంచిది అనే భావన లో ఉన్నారు అని అంటున్నారు. మహేష్ సినిమా అయినా మరో హీరో సినిమా అయినా సరే ఇతర భాషల నుంచి వచ్చి ఎక్కువగా డిమాండ్ చేస్తే మాత్రం అవసరం లేదు అని చెప్పే ఆల్లోచనలో ఉన్నారట ఇప్పుడు. 

 

దాదాపు ఎవరు అయినా సరే ఇదే విధంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. తమిళ భాష కు చెందిన చాలా మంది ఇక్కడ  ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. కానీ మన హీరోలకు మాత్రం అవకాశం అనేది అక్కడి సినిమాల్లో ఎక్కువగా ఇవ్వడం లేదు. ఈ అసహనం చాలా వరకు మన తెలుగు లో ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఇక అది ఎంతః వరకు ముందుకు వెళ్తుంది ఏంటీ అనేది చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: