టాలీవుడ్ లో సుకుమార్ సినిమా అనగానే చాలా మందికి కూడా ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉంటుంది కథ ఏ విధంగా ఉంటుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముందు నుంచి కూడా అదే విధంగా ఆయన సినిమాలు అనగానే క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన దాదాపుగా సినిమాల విషయంలో కొత్తదనం చూపించే ప్రయత్నం ఉంటుంది. ఇక ఆయన కూడా తన సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే ఉంటూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన  అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

పుష్ప అనే  కాస్త భిన్నమైన టైటిల్ తో ఈ సినిమా జనాల ముందుకు వస్తుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నారు. కథ లో ఉండే కోణం ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది అనే చెప్పాలి. దాదాపుగా ఈ సినిమా కోసం బన్నీ రెండేళ్ళ పాటు సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. కథ విషయంలో బన్నీ చాలా వరకు జాగ్రత్తగా ఉన్నాడు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా  విలన్ గా ఎవరిని తీసుకోవాలి అనేది ఇప్పుడు అర్ధం కావడం లేదు అని అంటున్నారు. 

 

ఈ సినిమాలో రష్మిక ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచన లో ఉన్నారు అనే వార్తలు వచ్చినా సరే అది నిజం కాదని చాలా మంది తర్వాత అన్నారు. ఇప్పుడు మరో పేరు కూడా సినిమా యూనిట్ ఆలోచనలో ఉంది అని అంటున్నారు. దాదాపుగా ఈ సినిమా హీరోయిన్ గా తమిళ హీరోయిన్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: