మనది బాలీవుడ్ రేంజ్.. ఇన్నాళ్లు ఇక్కడ ఉండి టైమ్ వేస్ట్ చేశాం. ఇక నార్త్ కు వెళ్లిపోవాలి అని ముంబై ఫ్లైట్ ఎక్కేసింది ఇలియానా. కానీ ఇప్పుడీ గోవా బ్యూటీని నార్త్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది ఇల్లీ బేబీ. సీనియర్స్ ని ఇంప్రెస్ చేసి కెరీర్ కాపాడు కోవాలని స్కెచ్చులేస్తోంది ఇలియానా. 

 

ఇలియానా దేవుడు చేసిన మనుషులు తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. బర్ఫీలో సెకండ్ హీరోయన్ రోల్ తో హిందీలో అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆరేళ్ల పాటు అక్కడ సినిమాలు కూడా చేసింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే మొదట్లో బాగానే ఉన్నా బీటౌన్ ఎప్పుడు ఈ హీరోయిన్ ని పక్కనపెట్టేస్తోంది. 

 

ఇలియానా అంటే ఆడియన్స్ కు ఒక స్లిమ్ ఫిట్ కటౌట్ గుర్తుకు వస్తుంది. బెల్లీ బ్యూటీ అనే ఇమేజ్ ఉంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రు నీబోన్ తో బ్రేకప్ తర్వాత ఇలియానా కటౌట్ లో చాలా మార్పులొచ్చాయి. వెయిట్ పెరిగి స్లిమ్ ఫిట్ నుంచి.. ఎక్స్ ట్రా లార్జ్ కు వెళ్లింది. ఇక హెవీ బ్యూటీతో కలిసి నటించడం తమ వల్ల కాదంటూ చాలామంది హీరోలు ఆమెను పక్కనపెట్టేశారు. దీంతో ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి. 

 

ఇలియానాకు హిందీలో అవకాశాలు తగ్గాక తెలుగుకి వచ్చింది. అమర్ అక్బర్ ఆంటోనీతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఇలియానాను చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇల్లీబేబీ ఇంత వెయిట్ పెరిగింది ఏంటని షాక్ అయ్యారు. ఈ కటౌట్ చూసి తెలుగు మేకర్స్ ఇలియానాను కన్సిడర్ చేయడం మానేస్తున్నారు. దీంతో కెరీర్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతోంది ఇలియానా. 

 

ఇలియానా మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటోంది. కానీ బాలీవుడ్ పట్టించుకోవడం లేదు. అందుకే తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతోంది గోవా కోవా. ఇప్పటికే వెయిట్ తగ్గిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, ఐయామ్ బ్యాక్ అనే మెసేజ్ లు పాస్ చేసింది. సీనియర్ హీరోలతో నటించేందుకు రెడీ అని తెలుగు మేకర్స్ తోనూ మాట్లాడుతోంది. మరి ఇలియానా ప్రయత్నాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: