టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జనాలు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం చాలా ప్రచారాలు ఇప్పుడు టాలీవుడ్ లో మనం చూస్తూ వస్తున్నాం. ప్రధానంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్యన ఉండే కొన్ని కొన్ని సీన్స్ గురించి చాలానే వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ వర్గాల్లో. వీరు ఇద్దరూ కలిసి ఒక భారీ ఫైట్ చేసే అవకాశం ఉంది అని దానికి భారీగా బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అనేది తెలియదు గాని దానికి సంబంధించిన ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో జరిగింది. 

 

ఇక ఈ సినిమాలో చాలా వరకు కూడా కీలక సన్నివేశాలకు సంబంధించి జాగ్రత్తలు పడుతుంది చిత్ర యూనిట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఇప్పుడు బడ్జెట్ కోత ఉండే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. అందుకే ఆ భారీ ఫైట్ కి సంబంధించి చాలా  వరకు కట్ చేసారు అని ఎక్కువగా బడ్జెట్ అనేది లేకుండా చాలా వరకు దర్శకుడు జాగ్రత్త పడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు గాని దీనికి సంబంధించి ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో జరుగుతూ వస్తుంది. 

 

టాలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం మాత్రం చాలా వరకు కూడా వార్తలు ప్రచారం లో ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది తెలియదు గాని చాలా మంది రిలీజ్ డేట్ కి సంబంధించి ఏదోక విధంగా వార్తలు రాస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్  లో టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: