టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, కొన్నేళ్ల క్రితం నుండి ఇంకా ఇప్పటికీ కూడా అదే క్రేజ్ తో టాలీవుడ్ నెంబర్ గా కొనసాగుతున్నారు అని, దానికి కారణం వయసు పెరిగినప్పటికీ నటన, డ్యాన్స్ లలో ఆయన గ్రేస్ తగ్గకపోవడమే కారణం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే మెగాస్టార్ చిరు తరువాత ఇప్పటివరకు చాలా మంది హీరోలు ఆయన ఫ్యామిలీ నుండి పరిచయం అవగా, వారిలో దాదాపుగా అందరు హీరోలు కూడా ప్రేక్షకుల మెప్పుతో ఎందరో అభిమానుల క్రేజ్ తో స్టార్స్ గా కొనసాగుతున్నారు. కాగా కొన్నాళ్ల నుండి కొందరు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల ఫ్యాన్స్ మధ్య పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక చర్చ జరుగుతోంది. 

IHG

వీరిద్దరిలో ఎవరు గొప్ప, ఎవరి పవర్ ఎంత అనే విషయమై బాగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ముందుగా వీరిద్దరిలో 2003లో ముందుగా గంగోత్రి తో నటుడిగా పరిచయమైన అల్లు అర్జున్, ఆ తరువాత వచ్చిన ఆర్య సినిమా సూపర్ హిట్ తో యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అనంతరం దేశముదురు, పరుగు, జులాయి, రేస్ గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలవైకుంఠపురములో సినిమాల సక్సెస్ లతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకోవడంతో పాటు అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్నారు అల్లు అర్జున్. ఇటీవల అలవైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ జాతీయ స్థాయిలో సూపర్ హిట్ కొట్టి అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇకపోతే 2007లో మెగాస్టార్ నటవారసుడిగా చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్, తొలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టారు. ఆపై రాజమౌళి తీసిన మగధీర సినిమాతో పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్, ఆపై రచ్చ, ఎవడు, ధ్రువ, రంగస్థలం సినిమాలతో పెద్ద హిట్స్ అందుకున్నారు. 

 

కాగా ఇటీవల వచ్చిన రంగస్థలం సినిమా, నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరొక్కసారి రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ పెరగడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. అలానే అలవైకుంఠపురములో తో నార్త్ లో క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతము సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకరకంగా ఈ హీరోలు ఇద్దరిరూ కూడా ఎవరికి వారు ప్రత్యేకమైన క్రేజ్ తో పాటు మార్కెట్, ఫ్యాన్ పవర్ సంపాదించి సమానంగా కెరీర్ లో కొనసాగుతున్నారని, అలానే ఇద్దరూ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు అందుకోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: