కరోనా దెబ్బకి మొన్నటి వరకూ వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. దీంతో వ్యవస్థలన్నీ అత్యంత జాగ్రత్తగానే గాడిలో పడుతున్నాయి. సినీ పరిశ్రమకు షూటింగ్స్ పర్మిషన్ కూడా వచ్చింది కాబట్టి అన్ని జాగ్రత్తలతోనే షూటింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే.. ప్రభుదేవా దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘రాధే’ సినిమా గురించి బాలీవుడ్ లో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రౌండ్ అవుతోంది.

IHG's bare-bodied look from Eid <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=2020' target='_blank' title='2020-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>2020</a> ...

 

సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తైంది. మిగిలిన షూటింగ్ పూర్తి చేసీ ఈ ఏడాది ఈద్ కు విడుదల చేయాలని భావించాడు సల్మాన్. కరోనా దెబ్బకు పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను ఆగష్టులో ప్రారంభించి అదే నెలలో పూర్తి చేయాలని సిద్ధమయ్యాడట. ఇందుకు ముంబయి బాంద్రాలోని మెహబూబా స్టూడియో మొత్తాన్ని ఆగష్టు మొదటి వారం నుంచి నెలాఖరు వరకూ మొత్తం స్టూడియోనే రెంట్ కు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇందులోనే యాక్షన్ ఘట్టాలను ఓ పాటను తెరకెక్కించాలని భావిస్తోందట టీమ్.

IHG'Most <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WANTED' target='_blank' title='wanted-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>wanted</a> Bhai'

 

ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ కష్టం కాబట్టి సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యూనిట్ నుంచి ఎటువంటి అఫిషియల్ న్యూస్ రాకపోయినప్పటికీ బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాలను సల్మాన్ తన సోదరుడితో కలిసి నిర్మిస్తున్నాడు. అతుల్ అగ్నిహోత్రి కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సల్మాన్ కు జోడీగా దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: