డాన్ శీను, బలుపు సినిమా తర్వాత గోపిచంద్ మలినేని డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా క్రాక్. మాస్ మహరాజ్ రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుందని చెబుతున్నాడు గోపిచంద్. క్రాక్ సినిమాలో రవితేజ డాన్ శీను సినిమాలో కనిపించినంత జోష్ గా కనిపిస్తారని. కొన్ని యధార్ధ సంఘటనన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని అంటున్నాడు గోపిచంద్ మలినేని. ఓ చిన్న షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందట.  

 

తన కెరియర్ లో మొదటిసారి రియలిస్టిక్ గా సినిమా చేశానని.. తన సినిమాలెప్పుడు కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటాయని అంటుంటారు. అయితే గోపిచంద్ మాత్రం ఈసారి రియలిస్టిక్ గా సినిమా చేశామని.. సినిమా కమర్షియల్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నాడు గోపిచంద్. ఈ సినిమా సహజత్వానికి చాలా దగ్గరగా తీశామని.. సినిమా చూసిన ఆడియెన్స్ కూడా అదే ఫీల్ అవుతాడని చెబుతున్నాడు గోపిచంద్.   

 

ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈమధ్య ఓటిటిలో క్రాక్ రిలీజ్ అంటూ వార్తలు రాగా ప్రస్తుతానికి సినిమాను ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచన లేదని.. వ్యాక్సిన్ వస్తే సినిమా వాళ్లే ముందు ఊరిపి పీల్చుకుంటారని అంటున్నాడు గోపిచంద్. 

 

రవితేజతో మూడు సినిమాలు చేసిన గోపిచంద్ సెట్ లో ఆయన ఉంటే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుందని.. కేవలం తన పాత్ర వరకే కాకుండా సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేందుకు తన సజెషన్స్ ఇస్తారని అన్నారు గోపిచంద్.                      

మరింత సమాచారం తెలుసుకోండి: