వరసగా దారుణమైన ఫ్లాపుల తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా ఇక సినిమా చేస్తున్నారు. గతంలో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి మీద హిట్ ఇస్తాడన్న నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఇన్నాళ్ళకి అవకాశం ఇచ్చాడు బాలయ్య. ఇంకా ఈ సినిమాకి పేరైతే పెట్టలేదు గాని బీబీ 3 అని మాత్రం చెప్పుకుంటున్నారు. ఈ సినిమా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా అని.

 

ఇక ఫస్ట్ రోర్ ..అంటూ రిలీజ్ చేసిన టీజర్ బాలయ్య చెప్పే డైలాగుల్లాగే బాగా దూసుకుపోయుంది. యూట్యూబ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసి సంచలనం సృష్ఠించాడు. అంతేకాదు ఈ టీజర్ లో చెప్పిన ఒక డైలాగ్ ఎవరో రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసే చెప్పించారన్న టాక్ కూడా వచ్చింది. ఏదైతేనేమి టీజర్ మాత్రం బాలయ్యకి బాగా కిక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా హిట్ బోయపాటికి చాలా కీలకం.  

 

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో రక రకాల పుకార్లు వస్తున్న కారణంగా బోయపాటి అవన్నీ అవాస్తావమంటూ కొట్టి పారేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ కొంతమందికి విచిత్రంగా ఉంది. ఈ సినిమా కోసం ఓ డెబ్యూ హీరోయిన్ ని తెలుగు తెరకి పరిచయం చేస్తాడట బోయపాటి. బాలయ్య పక్కన నటించడానికి ఇక్కడున్న హీరోయిన్స్ సూటవక బాలీవుడ్ నుంచి కొత్త మోడల్ ని తెస్తానని చెబుతున్నాడు.

 

ఇప్పటికే కొంతమందితో సంప్రదింపులు కూడా జరిపాడట. త్వరలో ఒక మోడల్ ని బాలయ్య హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తాడట. మోడల్స్ ని హీరోయిన్స్ గా పరిచయం చేసే టాలెంట్ పూరి కి బాగా ఉంది. దాదాపు తన సినిమా ద్వారా బాలీవుడ్ మోడల్స్ నే దింపుతుంటాడు. ఇప్పుడు బోయపాటి కూడా అదే ఫాలో అవుతున్నాడు. 

 

మరి బాలయ్య సినిమాతో టాలీవుడ్ కి ఎంటరయ్యో హాట్ బ్యూటీ ఎవరో చూడాలి. నిన్నా మొన్నటి వరకు శ్రియ, అంజలి, ప్రియమణి...ఇలా చాలా పేర్లు ప్రచారంలో నలిగాయి. ఎట్టకేలకి ఆ అవకాశం కొత్తమ్మాయిని వరించబోతుందట. ఇక ఈ చిత్రాన్ని బోయపాటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ద్వారా క్రియోషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్నాడు. మరి బయోపిక్ లతో ..తమిళ దర్శకుడితో ఫ్లాపులు చూసిన బాలయ్య మళ్ళీ హిట్ కొడతాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: