త్రివిక్రం శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా అల వైకుంఠపురములో. నా పేరు సూర్య తో దెబ్బతిని ఉన్న అల్లు అర్జున్ కి ఈ సినిమా భారీ హిట్ తో పాటు వెయ్యోనుగుల బలాన్ని ఇచ్చింది. దాంతో ఆలస్యం చేయకుండా  సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అన్న హ్యాట్రిక్ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంటున్నాడు. ప్రభాస్ లాగా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని బాగా ఉబలాటపడుతున్నాడు బన్ని. అందుకే ఈ పాన్ ఇండియా సినిమాని 5 భాషల్లో రూపొందిస్తున్నారు. 

 

IHG

సక్సస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. సరిలేరు నీకెవ్వరు..భీష్మ సినిమాలతో మాంచి ఊపు మీదున్న రష్మిక మందన్న ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకోసం చిత్తూరు యాస నేర్చుకుంటూ హోం వర్క్ కూడా చేస్తుంది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉందట. కాకపోతే ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. నిత్యా మీనన్..నివేదా థామస్ ల పేర్లు మాత్రం పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ మధ్య ఊపు తగ్గిన రాక్ స్టార్ దేవీ ప్రసాద్ ఈ సినిమాకి సంగితమందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి బన్ని ఫ్యాన్స్ తో పాటు జనాలు బాగానే అట్రాక్ట్ అయ్యారు.

 

IHG

అయితే అల్లు అర్జున్ ఎప్పుడో చేయాల్సిన సినిమా ఒకటి హోల్డ్ లో ఉంది. అదే ఐకాన్. ఆ సినిమాకి దర్శకుడు వేణూ శ్రీరాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దాదాపు టాకీపార్ట్ ని కంప్లీట్ చేసినట్టే. పవన్ కళ్యాణ్ గనక వస్తే షూటింగ్ వరకు గట్టెక్కిస్తాడు. కాని అదే జరగడం లేదు. ఇప్పుడు  ఈ సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడి సక్సస్ మీదే అల్లు అర్జున్ నెక్స్ట్ ఐకాన్ సినిమా ఆధారపడి ఉందని తెలుస్తుంది. 

 

IHG's Fate! | Gulte - Latest Andhra ...

వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరాం కి సక్సస్ పరంగా గొప్ప ట్రాక్ రికార్డ్ ఏమీ లేదని చెప్పాలి. గతంలో ఓ ఫ్రెండ్ తీసి ఫ్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత నాని తో తీసిన ఎంసిఎ కూడా గొప్ప కమర్షియల్ సినిమా కాదు. అందుకే వేణు శ్రీరాం తో చేయాలనుకున్న ఐకాన్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి పుష్ప ని లైన్ లో పెట్టాడట అల్లు అర్జున్.

 

IHG

ఇప్పుడు వేణు శ్రీరాం  వకీల్ సాబ్ తో ఒక భారీ హిట్ ఇస్తేనే తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఐకాన్ జారిపోయో అవకాశాలున్నాయి. అంటే పవర్ స్టార్ కి హిట్ ఇస్తేనే స్టైలిష్ స్టార్ కమిటవితాడట ..!

మరింత సమాచారం తెలుసుకోండి: