ఆర్జివి నుండి రాబోతున్న మరో సంచలనం పవర్ స్టార్. క్లైమాక్స్, నగ్నం సినిమాల తర్వాత ఆర్జివి చేస్తున్న సినిమా పవర్ స్టార్. ఈ సినిమాలో తన హీరో పేరు పవర్ స్టార్ అంటూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వర్మ రోజుకో పోస్టర్ తో హంగామా చేస్తున్నాడు. పవర్ స్టార్ సినిమాలో ఓ పోస్టర్ కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటంటే అందులో హీరో అదేనండి పవర్ స్టార్ ఓ గెడ్డంతో క్యాప్ పెట్టుకుని ఉన్న డైరక్టర్ ను కొడతాడు. 

 

పవర్ స్టార్ లో ఆ సీన్ సినిమా ప్రమోషన్స్ కు వాడుకునేందుకు అలా పెట్టాడా లేక రియల్ గానే అలా జరిగిందా అన్న డౌట్ మొదలైంది. పవర్ స్టార్ పోస్టర్ లో ఆర్జివి పెట్టిన ఆ సీన్ రీలా.. రియలా అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో టిఎస్ అనే పేరు గల పాత్ర కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు. ఇక ఆ పోస్టర్ చూస్తే పవన్ కళ్యాణ్, త్రివిక్రం శ్రీనివాస్ ను కొట్టినట్టుగా ఉంది. మరి పవన్ నిజంగానే త్రివిక్రం మీద చేయి చేసుకున్నాడా లేక ఆర్జివి పవర్ స్టార్ సినిమా కోసం అలా చూపిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

 

కేవలం పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాకు కావాల్సిన హైప్ తెచ్చే ఆర్జివి ఈ సినిమా కోసం కూడా అలాంటి కొన్ని సీన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ఇంతకీ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత కథ అంటూ పవర్ స్టార్ సినిమాలో వర్మ ఏం చెప్పబోతున్నాడు.. పవన్ మీద అభిమానం ఉందంటూనే టార్గెట్ చేసే ఆర్జివి పవర్ స్టార్ లో అసలు ఏం చూపిస్తాడో తెలియాల్సి ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: