పవన్ కళ్యాణ్ సీనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడు. పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగినట్టే.. సినిమాల విషయంలో పెద్దాయన్ని అనుసరిస్తున్నాడు. మహానటుడి మాదిరి  బందిపోటు అనిపించుకోవాలా.. లేదంటే గజదొంగ అని పిలిపించుకోవాలా.. అనే డైలమాలో ఉన్నాడు పవన్. 

 

వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ మూవీలో జాయిన్ అవుతాడు. పీరియాడికల్ మూవీ కావడం.. ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండే సీన్సే ఎక్కువ ఉండటంతో.. కరోనా తగ్గిన తర్వాతే సినిమా మొదలు పెడతారట. ఇందులో పవన్ ది బందిపోటు పాత్ర కావడంతో.. సినిమాకు ఎన్టీఆర్ టైటిల్స్ బందిపోటు.. గజదొంగ పేర్లను పరిశీలిస్తున్నారు. 

 

పవన్, క్రిష్ మూవీ విరూపాక్ష అనే బలమైన వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. అయితే.. తన పాత్రకు అనుగణంగా బందిపోటు.. గజదొంగ టైటిల్స్ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించమని.. క్రిష్ కు పవన్ సలహా ఇచ్చాడు. ఈ వార్త బయటకు రాయడంతో.. ఫ్యాన్స్ బందిపోటు టైటిల్ వైపు మొగ్గు చూపుతూ.. లోగోలు డిజైన్ చేస్తున్నాడు. బందిపోటు హ్యాష్ ట్యాగ్ తో టైటిల్ ను  పాపులర్ చేసేస్తున్నారు. 

 

ప్రభాస్, పూజా హెగ్డే మూవీకి జాన్.. రాధే శ్యాం.. ఓ డియర్ లాంటి టైటిల్స్ అనుకుంటే.. రాధే శ్యామ్ టైటిల్ ఫ్యాన్స్ కు వచ్చి.. హ్యాష్ ట్యాగ్ తో పాపులర్ చేసేశారు. చివరకు రెబల్ ఫ్యాన్స్ టేస్ట్ కు తగ్గట్టే రాధే శ్యామ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇదే సిట్యువేషన్ పవన్, క్రిష్ మూవీకి రిపీట్ అవుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరిక మన్నించి బందిపోటు అనే టైటిలే ఖరారు చేస్తారేమో. పనిలో పనిగా.. బందిపోటులోని పాటను కూడా రీమేక్ చేసినా చేయొచ్చేమో. మొత్తానికి పవన్ కళ్యాణ్ సీనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడు. 




 

 

మరింత సమాచారం తెలుసుకోండి: