మహమ్మారి కరోనా వైరస్ రాకతో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. థియేటర్ లు క్లోజ్ అవటంతో సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. మరోపక్క ఉన్న కొద్ది వైరస్ బలపడుతోంది తప్ప ఎక్కడా తగిన పరిస్థితి కనబడటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి తరుణంలో సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకి ఓటీటీ ఏకైక మార్గం గా కనబడుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ లో బడా నిర్మాతలు వెబ్ వరల్డ్ లో ప్రొడక్షన్ హౌస్ లు స్టార్ట్ చేయడం జరిగింది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ 'ఆహా' అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర కూడా ఓటీటీ ప్లాట్ ఫాం రూట్ లో రావడానికి రెడీ అవుతున్నారట. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇటీవల ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఇవ్వటం జరిగింది.

 

ఈ తరుణంలో రచయిత మధుబాబు ‘షాడో’ అనే పేరుతో నవల ఆధారంగా రచించినది వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించడానికి అనిల్ సుంకర రెడీ అవుతున్నారట. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా మరియు అల్లరి నరేష్ నీ నటింపజేయడానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ తరుణంలో వెబ్ సిరీస్ నటించాలా అనే సందిగ్ధంలో ఇద్దరు హీరోలు సందిగ్ధంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే పలు కీలకమైన ప్రాజెక్టులు ఒప్పుకున్న తరుణంలో వెబ్ సిరీస్ లో నటించడానికి చాలా ఆలోచనలను ఇద్దరు హీరోలు చేస్తున్నట్లు సమాచారం.

 

మరోపక్క సినిమా షూటింగ్ లు స్టార్ట్ చేయాలంటే కనీసం టైం ఇంకా ఎక్కువ పట్టే అవకాశం ఉండటంతో తప్పదు తప్పనిసరిగా అన్నట్టు ఈ ఇద్దరు దగ్గుబాటి రానా మరి అల్లరి నరేష్ ఈ వెబ్ సిరీస్ సినిమాకి ఓకే చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి అని టాక్. ఇటువంటి తరుణంలో సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: