తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ గా వుంది అయితే కరోనాతో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేకపోవడంతో ఈసినిమా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి ఇక దీనిపై మాస్టర్ నిర్మాత బ్రిట్టో మరోసారి క్లారిటీ ఇచ్చాడు. సినిమాను మొదట థియేటర్లలోనే విడుదలచేస్తాం. దీపావళి వరకు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అనుకుంటున్నాం ఒకవేళ అలానే జరిగితే దీపావళికి మాస్టర్ ను విడుదలచేస్తాం లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకువస్తాం అని బ్రిట్టో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సో దీపావళికి మాస్టర్ విడుదల కాకపోతే సంక్రాంతి ఆప్షన్ కూడా ఉంది. 
 
నిజానికి ఈసినిమా ఏప్రిల్లోనే విడుదల కావల్సింది కానీ అప్పటికే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో వాయిదాపడింది.  ఇక ఇప్పటికే మాస్టర్ ట్రైలర్ ను కట్ చేసి రెడీ గా ఉంచారు కానీ విడుదల మాత్రం చేయడం లేదు. గత నెలలో విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూశారు కానీ నిరాశనే మిగిలింది. సినిమా విడుదలయ్యే రెండు వారాల ముందు మాత్రమే ట్రైలర్ ను విడుదలచేయాలని మేకర్స్ బావిస్తున్నారట.
 
లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈచిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈచిత్రంలో పేట ఫేమ్ మాళవిక మోహనన్  హీరోయిన్ గా నటించగా అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. ఈసినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈచిత్రం తెలుగులో కూడా విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: