కొన్ని సినిమాలు ఎనౌన్స్ చేయగానే సంచలనం రేపుతాయి. మరికొన్ని కంటెంట్ పరంగా సంచలనం రేపుతాయి. ఈరెండు అంశాలతో తెరకెక్కే సినిమాలు కాంట్రవర్శీకి దారి తీస్తాయి. అటువంటి కోవలోకి వచ్చే సినిమానే ‘వంగవీటి’. మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఇతివృత్తమే ఈ సినిమా కథాంశం. విజయవాడలో వంగవీటిదేవినేని కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు అప్పట్లోనే రాష్ట్ర రాజకీయాలను శాసించాయి. ఈ ఇతివృత్తాన్ని సినిమాగా మలిచాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వాస్తవ ఘటనలను సినిమాలుగా మలచడంలో వర్మ నేర్పరి

IHG

 

ఈ సినిమాను తెరకెక్కిస్తారని అనౌన్స్ మెంట్ వచ్చిన నాటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. తమ వాదన తీసుకోకుండా సినిమా తీసేందుకు వీలు లేదని అన్నారు. వర్మ కూడా విజయవాడ వచ్చి వంగవీటిదేవినేని కుటుంబసభ్యులను కలిసాడు. అయినా వర్మకు చాలా బెదిరింపులు వచ్చాయి. ‘నేను ఆ హోటల్ లో ఆ రూమ్ నెంబర్ లో ఉంటున్నాను. రేపు సాయంత్రం వరకూ అక్కడే ఉంటాను. నాకు వార్నింగ్ లు ఇచ్చేవారు ఆ రూమ్ కి వచ్చి మాట్లాడండి’ అని వర్మ పబ్లిక్ స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనమైంది. ఇన్ని వివాదాల మధ్యనే వర్మ వంగవీటి సినిమాను తెరకెక్కించాడు.

IHG

 

సినిమా విడుదల సమయంలో విజయవాడలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ.. ఎటువంటి వివాదాలు జరగలేదు. రోజులు, పరిస్థితులు మారడంతో సినిమాను సినిమాలా చూసి ఆదరించారు ప్రేక్షకులు. సినిమా విడుదల తర్వాత పలు వాదోపవాదాలు జరిగినా అవి అంత తీవ్రం కాలేదు. ఈ రెండు కుటుంబాల ఆధిపత్యంతో ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలకు విజయవాడే వేదికైంది. రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయినా రాజకీయ రాజధానిగా విజయవాడ ఉండేదంటే పరిస్థితులు ఏస్థాయిలో ఉండేవో అర్ధం చేసుకోవచ్చు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: