హీరోగా 26 సినిమాలు చేసిన సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన 27వ సినిమా పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాటగా రాబోతున్నడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక మహేష్ లేటెస్ట్ రిలీజ్ సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ గా మహేష్ డ్యాన్స్ లో కూడా అదరగొట్టాడు.

 

25 సినిమాల్లో మహేష్ డ్యాన్స్ కు రాని క్రేజ్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాంక్ సాంగ్ కు వచ్చింది. ఆ పాటలో లుంగీ కట్టి మరి మహేష్ వేసిన మాస్ స్టెప్పులకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఆ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మహేష్ కెరియర్ లో మొదటిసారిగా ఒక వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యింది. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాంక్ సాంగ్ నిజంగానే ఆడియెన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.

 

శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ లో మహేష్ ఎప్పుడు లేనిది తన డ్యాన్స్ మూమెంట్స్ తో దుమ్ముదులిపేశాడు. ఈ సాంగ్ లో మహేష్ తో పాటుగా రష్మిక కూడా అదరగొట్టింది. ఈ సినిమాలో మైండ్ బ్లాంక్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి మహేష్ ఇక తన ప్రతి సినిమాలో ఓ మాస్ డ్యాన్స్ సాంగ్ ఉండేలా చూస్తానని అభిమానులకు హామి ఇచ్చాడు. ఎప్పుడు సింపుల్ స్టెప్స్ వేసే మహేష్ డ్యాన్స్ ఫ్లూర్ అదిరే స్టెప్పులేస్తే ఇలా రికార్డులు బ్రేక్ చేస్తాడన్న మాట. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సాంగ్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: