మళయాళంలో ప్రేమం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమం రీమేక్ లో తన పాత్ర తనే చేసి మెప్పించింది. అఆ సినిమా తర్వాత అమ్మడికి క్రేజ్ రాగా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. యువ హీరోల సరసన బెస్ట్ ఆప్షన్ గా అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇక సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టాగ్రాం లో 1, 2 కాదు ఏకంగా 7 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించింది.

 

సౌత్ లో ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లో క్రేజీగా ఉన్న వారిలో అనుపమ ఒకరని చెప్పొచ్చు. 7 మిలియన్ క్రేజీ ఫాలోవర్స్ ను పొందిన అనుపమ ఈ స్పెషల్ ట్రీట్ తో చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు తన ఫాలోవర్స్ అందరికి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది. లవ్ యు ఆల్.. మీ వల్లే ఇది సాధ్యమైందని అమ్మడు మెసేజ్ కూడా చేసింది. 

 

ఈమద్య కాలంలో హీరోలతో పాటుగా హీరోయిన్స్ సోషల్ ఖాతల్లో ఫాలోవర్స్ బాగా వస్తున్నారు. హీరోల గురించి కేవలం అప్డేట్స్ రావొచ్చేమో కాని హీరోయిన్స్ అయితే వారానికో ఫోటో సూట్ చేస్తుంటారు. అందుకే హీరోయిన్స్ కే ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ బాగా ఉంటారు. కొత్తగా 7 మిలియన్ ఫాలోవర్స్ పొందిన అనుపమకు వీటితో పాటు ఛాన్సులు కూడా వచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2లో నటిస్తున్న ఈ అమ్మడు తమిళ, మళయాళ భాషల్లో కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాల్లోకి వచ్చాక ఇన్నాళ్లు షూటింగ్ లేకుండా ఎప్పుడా లేదని చెబుతున్న అనుపమ త్వరలో తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటానని చెబుతుంది.       

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My 7 million family hit me like 😘♥️ I love you allllllllllllll ♥️ @lavanyabathina thanks a lot for this lovely frock 😘 @sajadkaakku ur #chasma is killing it 🤪 and my dearest brother @akshayeparameswaran had a really tough time clicking this 7m series... I love you and sorry for irritating you 😘

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: