టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ దర్శకత్వంలో మొదటగా వచ్చిన ఆది సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం వారిద్దరూ కలిసి చేసిన రెండవ సినిమా సాంబ యావరేజ్ సక్సెస్ అందుకోగా, ఆపై వారిద్దరూ కలిసి కొన్నేళ్ల తరువాత చేసిన సినిమా అదుర్స్. కామెడీ, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కొడాలి నాని ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు. 

IHG

అందాల భామలు నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా 2010 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి మంచి టాక్ ని సంపాదించింది. కాగా ఇందులో ఎన్టీఆర్, నరసింహ అనే యువకుడి పాత్రతో పాటు, చారి అనే బ్రాహ్మణుని పాత్రలో నటించడం జరిగింది. కాగా రెండవ పాత్రైన చారి పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడి హోమ్ వర్క్ చేసి మరి తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటన, పలికిన కామెడీ డైలాగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అయితే, సినిమాలోని చారి పాత్ర ద్వారా తమ సామజిక వర్గం వారిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా మమ్మల్ని విమర్శించారు అంటూ బ్రాహ్మణులు ఆ సినిమాపై ఆరోపణలు చేసారు. 

 

అలానే ఆ తరువాత ఆ సినిమా సమర్పకుడైన కొడాలి నాని ఈ సినిమాలో పెట్టుబడుల విషయమై తెలంగాణ రాష్ట్రంలో కొంత వివాదం చెలరేగడంతో సినిమాని అక్కడ చాలా ప్రాంతాల్లో అడ్డుకున్నారు. కాగా మంచి టాక్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకి, అనుకోకుండా జరిగిన ఈ రెండు వివాదాల వలన కలెక్షన్ పరంగా బాగా ప్రభావం ఏర్పడింది. అలానే తెలంగాణలో ఈ సినిమా ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు. ఆ విధంగా అదుర్స్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో వివాదాస్పద సినిమాగా మిగిలిపోయింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: