సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలకు సంబంధించి అక్కడక్కడా వివాదాలు జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే వాటిలో సినిమా రిలీజ్ తరువాత ఏర్పడ్డ వివాదాలు కొన్ని అయితే, సినిమా ప్రారంభమయి షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ సినిమా కాసెప్ట్ వంటివాటి విషయంలో వివాదాలు జరిగిన ఘటనలు మరికొన్ని. అయితే వీటన్నిటికీ కొంత భిన్నంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటించిన గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో జరిగింది. అలానే అటువంటి ఘటన గతంలో దాదాపుగా ఏ సినిమా విషయంలో కూడా జరుగలేదు అనే చెప్పాలి. 

IHG

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా, అంతకముందు తమిళ్ లో తెరెకక్కిన జిగర్తాండ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రారంభం సమయంలో దీనికి వాల్మీకి అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. అయితే షూటింగ్ మొదలైన దగ్గర నుండి సినిమాను నిలుపుదల చేయాలని వాల్మీకి బోయ సామజిక వర్గం వారు హెచ్చరించడం జరిగింది. రామాయణాన్ని రచించిన వాల్మీకి వంటి గొప్ప వ్యక్తి పేరుని ఈ సినిమాకు పెట్టడం సరైనది కాదని వారు నిరసన తెలియచేసారు. అయినప్పటికీ కూడా సినిమా మాత్రం షూటింగ్ కొనసాగుతుండడంతో వాల్మీకి వర్గం వారు కోర్ట్ లో కేసు వేయడం జరిగింది. 

 

అయితే అప్పటికే కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఆ కేసు విషయమై సినిమా టైటిల్ ని మార్చి తీరాల్సిందే అంటూ కోర్ట్ తీర్పునివ్వడం జరిగింది. ఇక ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే, సరిగ్గా రేపు సినిమా రిలీజ్ అవనుండగా, ముందురోజు మధ్యాహ్నం కోర్ట్ తీర్పు రావడంతో, అప్పటికప్పుడు సినిమా యూనిట్ వారు ప్రెస్ మీట్ పెట్టి, మూవీ టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చడం జరిగింది. అయితే ఈ వివాదంతో టైటిల్ మార్పు చేయడం వలన, అది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. కానీ వాటిన్నిటినీ పటాపంచలు చేస్తూ, రిలీజ్ తరువాత గద్దలకొండ గణేష్ సినిమా ఎంతో పెద్ద సక్సెస్ అందుకుంది......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: