మంచు వారబ్బాయి విష్ణు హీరోగా హన్సిక మోత్వానీ హీరోయిన్ గా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేనికైనా రెడీ. 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద ఘన విజయం సాధించింది. ముస్లిం వ్యక్తి అయిన తన తండ్రిని పెళ్లి చేసుకున్న అనంతరం జరిగిన గొడవల వలన కొన్నేళ్ల క్రితం విడిపోయిన తన తల్లి, మేనమాలను కలపాలని హీరో, ఒక బ్రాహ్మణుడిగా మేనమామ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత జరిగిన పలు పరిణామాల అనంతరం చివరికి అసలు నిజాలు తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది. 

IHG

కాగా ఈ స్టోరీని ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిపి దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో ముస్లిమ్ అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడుగా యాగం జరిపించడం, అలానే సినిమాలోని పలు సీన్లు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆ సామజిక వర్గానికి చెందిన పలువురు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఒకానొక సమయంలో యూనిట్ వారికి పిండాలు కూడా పెట్టడం జరిగింది.  

 

దాదాపుగా కొన్నాళ్లుగా జరిగిన ఈ నిరసనల ప్రభావం కొంతమేరకు సినిమా కలెక్షన్ పై పడింది. కాగా తొలి రోజు నుండి మంచి టాక్ సంపాదించిన ఈ సినిమా, ఓవరాల్ గా మాత్రం బాగానే కలెక్షన్ తో పాటు విజయాన్ని కూడా అందుకుంది. కాగా ఈ సినిమా తరువాత హీరో విష్ణుకు కెరీర్ పరంగా మంచి పేరు, గుర్తింపు లభించడంతో పాటు హీరోయిన్ హన్సిక, దర్శకుడు నాగేశ్వర రెడ్డిలకు కూడా మంచి అవకాశాలు దక్కాయి. మొత్తంగా వివాదాల బారిన పడినప్పటికీ కూడా, దేనికైనా రెడీ సినిమా, కామెడీతో కూడా యాక్షన్ తరహా సినిమాలకు మంచి బాటను చూపింది అనే చెప్పాలి....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: