ఎప్పుడూ వివాదాలతో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ, గత కొన్ని రోజులుగా ఎనీ టైమ్ థియేటర్ అంటూ కొత్త పద్దతికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూతబడి మిగతా వాళ్లంతా తమ సినిమాలని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని భావిస్తుంటే వర్మ మాత్రం ప్రత్యేకంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అంటూ కొత్త విధానాన్ని తీసుకువచ్చాడు. అయితే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా శ్రేయాస్ ఈటీ యాప్ లో పే పర్ వ్యూ విధానంలో సినిమాలని రిలీజ్ చ్వేస్తూ వచ్చాడు.

 

 

ఇప్పటి వరకూ క్లైమాక్స్, నగ్నం సినిమాలని రిలీజ్ చేసిన వర్మ తాజాగా పవర్ స్టార్ అనే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై విమర్శనాత్మకంగా ఉన్న ఈ సినిమాపై చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. పవన్ అభిమానులు వర్మని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే వర్మకి ఇవన్నీ మామూలే. పబ్లిసిటీ కోసమే ఏదైనా చేస్తానని చెప్పే వర్మ అలాంటి రియాక్షన్ కోసమే ఎదురుచూస్తుంటాడని అంటారు.

IHG

అయితే ఈ పవర్ స్టార్ అనే చిత్రం శ్రేయాస్ ఈటీ యాప్ విడుదల కాదని సమాచారం. ఈ మేరకు శ్రేయాస్ శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించాడు. వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ శ్రేయాస్ ఈటీలో విడుదల కావడం లేదని, అదొక్కటే కాదు వివాదాస్పద అంశాలు కలిగిన ఏ చిత్రమైనా మా యాప్ లో విడుదల చేయమని స్పష్టం చేసాడు.

 

మరి రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ ని ఎక్కడ రిలీజ్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక రిలీజ్ చేయడానికి తానే మరో కొత్త ఏటీటీని స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: