టాలీవుడ్ యంగ్ హీరో ఇటీవలే పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అర్జున్ సురవరం హిట్ తర్వాత నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 18 పేజెస్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా నిఖిల్ ఎంచుకునే సబ్జెక్టులు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. హ్యాపీడేస్ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో రెగ్యులర్ కమర్షియల్ హీరోగా చేసినప్పటికీ ఆ తర్వాత స్వామిరారా చిత్రంతో పూర్తిగా మారిపోయాడు.

 

స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ వంటి చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ప్రస్తుతం కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ వీడియోకి మంచి ఆదరణ దక్కింది.

IHG'Premam ...

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ సినిమా నుండి తప్పుకుందట. అందువల్ల ఆమె స్థానంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోయిన్ గా చేసిన శృతిశర్మని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఈ విషయమై ఇంకా క్లారిటీ లేదు.

IHG's de-glam look for the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> film Agent Sai ...

మరి చిత్ర దర్శకులు చందూ మొండేటి హీరోయిన్ విషయమై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి కోవిడ్ 19 వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు చక్కబడ్డ తర్వాత కార్తికేయ 2 చిత్రీకరణ మొదలవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: