టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఖుషి తర్వాత పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది హరీష్ శంకరే. అయితే గబ్బర్ సింగ్ 2 సినిమాను మిస్సైన హరీష్ శంకర్ ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు డైరక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ కాంబో సినిమా అనగానే అంచనాలు కామన్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నాడు హరీశ్ శంకర్. 

 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేస్తాడట. అయితే గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ కు పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈసారి కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఉంటాయని చెబుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో పవర్ స్టార్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసేలా సినిమా ఉంటుందని అంటున్నాడు హరీష్ శంకర్.

 

తప్పకుండా ఫ్యాన్స్ అందరు రిపీటెడ్ గా వచ్చి చూసేలా ఆ సినిమా ఉంటుందని అంటున్నాడు హరీష్ శంకర్. ఆయన అంత కాన్ ఫిడెంట్ గా చెబుతున్నాడు అంటే తప్పకుండా గబ్బర్ సింగ్ కాదు అంతకుమించి హిట్టు బొమ్మ తీస్తాడని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా హరీష్ శంకర్ వెబ్ సీరీస్ లను నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: