టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే చాలా మందికి వివాదాలు అనే అభిప్రాయం దాదాపుగా వస్తు ఉంటుంది. ఆయన ఏ సినిమా చేసినా సరే దాదాపుగా అదే విధంగా వివాదాలు అనేవి ఉంటాయి అనే విషయం చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల జీవితాల మీద కూడా వివాదాస్పదంగా సినిమాలు చేయడం ప్రముఖ వ్యక్తులతో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఏదోక రూపం లో  వివాదాస్పదంగా వ్యవహరించడం వంటివి మనం పదే పదే చూస్తూ ఉంటాం. ఆయనకు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఆయనలో మాత్రం మార్పు అనేది చాలా వరకు వచ్చే అవకాశం ఉండదు అనే చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే ఆయన తీసిన సినిమాల్లో బాగా వివాదాస్పదం అయినా సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పే సినిమా  వంగవీటి. ఈ సినిమా చాలా వరకు కూడా వివాదంగానే ఉంది. ఆ సినిమాలో ఆయన ఒక వర్గాన్ని అవమానించారు అని దేవినేని నెహ్రూ ని హీరో గా చూపించే విధంగా వ్యవాహరించారు అని చాలా మంది ఆరోపణలు చేసారు అప్పట్లో. ఇక ఆ సినిమాలో వంగవీటి రంగా ను అవమానించే విధంగా వ్యవహరించారు అని ఆయన కుమారుడు వంగవీటి రాధ ఆందోళన కూడా చేసిన సంగతి తెలిసిందే. 

 

ఈ వివాదంలో అప్పుడు టీడీపీ సర్కార్ కూడా బాగా ఇబ్బంది పడింది అనే చెప్పాలి. టీడీపీ హయం లో ఈ సినిమా రావడంతో దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చాలా మంది ఆరోపణలు చేసారు. ఇక నెహ్రో ని వెళ్లి కలవడం కూడా వర్మ అప్పుడు చేసిన పెద్ద తప్పు. ఆ విధంగా ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది అప్పుడు. ఆ వివాదం ఇప్పటికి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: