టాలీవుడ్ లో చాలా వరకు రౌడీ యుజం మీద వచ్చిన సినిమాలు ఏదోక రూపంలో వివాదం అవుతూనే ఉంటాయి. ఏదోక విధంగా భాషను అవమానించారు అని లేదా మరొక విధంగా సినిమాలో వాస్తవాలు చూపించలేదు అని చాలా మంది ఆరోపణలు చేయడం సినిమాలను రోడ్డుకి లాగడం వంటివి మనం పదే పదే చూస్తూ వస్తాం. ఇక టాలీవుడ్ లో చాలా వరకు కూడా వర్మ సినిమాలే వివాదాలుగా ఉంటాయి అనే సంగతి తెలిసిందే. వర్మ ఏది చేసినా సరే అది వివాదమే గాని అది ప్రశాంతంగా ఉండే అవకాశం మాత్రం ఏ విధంగా కూడా ఉండదు అని చాలా మంది అంటారు. 

 

ఆయన తీసిన కొన్ని కొన్ని సినిమాలు దాదాపుగా అదే విధంగా ఉంటాయి అనే చెప్పాలి. ఇక ఆయన ఫ్యాక్షన్ నేపధ్యంలో చేసిన కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి వివాదాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పే సినిమా రక్త చరిత్ర. ఈ సినిమాల్లో వర్మ వ్యవహరించిన తీరు  కొందరిని ఆయన హీరో మాదిరిగా చూపించిన తీరు అన్నీ కూడా సంచలనంగా మారాయి అనే చెప్పాలి. ప్రధానంగా పరిటాల రవి విషయంలో ఆయన ఒక వైపే ఆలోచించారు అనే  ఆరోపణలు అప్పట్లో చాలానే వచ్చిన సంగతి తెలిసిందే. 

 

వర్మ జాగ్రత్తగా సినిమా చెయ్యాల్సి ఉంది అని కాని ఈ విధంగా వివాదం చేసారు అని చాలా మంది అసహనం కూడా అప్పట్లో వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా చాలా వివాదాలకు వేదికగా మారింది. వర్మ ను కోర్ట్ కి లాగే అవకాశం ఉంది అనే  ప్రచారం కూడా అప్పుడు బాగానే జరిగింది అనే చెప్పాలి. ఇక వార్మ కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. టాలీవుడ్ లో ఈ సినిమా భయపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: