ఆటోనగర్ సూర్య...  ఈ సినిమా ఒక సంచలనం అనే సంగతి అందరికి తెలిసిందే. విజయవాడ రౌడీ యుజం గురించి ఈ సినిమాను చేసారు. నాగ చైతన్య హీరో గా దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా చాలా వివాదాలకు వేదికగా మారింది. అది ఏంటీ అంటే ఈ సినిమాలో చూపించిన కోణాలు విజయవాడ అంటే మొత్తం రౌడీ లే అనే విధంగా ఉంది అంటూ ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అప్పుడు చాలా మంది దర్శకుడి మీద విమర్శలు చేసారు. 

 

సినిమా కథలో చూపించిన చాలా కోణాలు అప్పుడు వివాదాలకు వేదికగా మారాయి. ఇక ఈ సినిమా సాధించిన విజయం ఏమీ లేకపోయినా వివాదాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో చైతూ పాత్ర పై కూడా విమర్శలు వచ్చాయి. అతన్ని హీరోగా చూపిస్తూనే అవమానించారు అని చాలా మంది అప్పుడు కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర విషయంలో కూడా విమర్శలు చేసారు చాలా మంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా వరకు కూడా దర్శక నిర్మాతలు విజయవాడ బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా  కథ చెయ్యాలి అంటే భయపడ్డారు అని అంటారు. 

 

కాని వర్మ లాంటి దర్శకులు మాత్రం విజయవాడ ను పదే పదే టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ పై రాజకీయంగా కూడా సైలెంట్ గా వివాదాలు వచ్చాయి అప్పుడు. ఈ సినిమా వసూళ్లు కూడా పెద్దగా రాలేదు గాని నాగ చైతన్య కు మాత్రం శివ లాంటి సినిమా వచ్చింది అని చాలా మంది అన్నారు అప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: