మన తెలుగులో బయోపిక్ లు అనగానే చాలా వరకు కూడా వివాదాలే ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలల్లో కేవలం ఒకే కోణం చూపిస్తారు అనే ఆరోపణలు ముందు నుంచి కూడా ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. దర్శక నిర్మాతలు చాలా వారకు కూడా తమకు ఏది కావాలో దాదాపుగా అదే చూపిస్తారు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే విధంగా వివాదాల మాయం అయింది. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం కోర్ట్ కి కూడా వెళ్ళారు. 

 

నాదెండ్ల భాస్కరరావు విషయంలో వివాదం బాగానే సినిమాను బాగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. ఆయన పాత్రను అవమానిస్తే మాత్రం కచ్చితంగా తాము చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని ఆయన చిన్న కుమారుడు కోర్ట్ కి కూడా వెళ్ళే ప్రయత్నం చేసారు. బాలకృష్ణ మీద దర్శకుడు క్రిష్ మీద కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసారు. తమ తండ్రిని అవమానిస్తే మాత్రం ఏ మాత్రం కూడా సహించేది లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు అప్పుడు. ఇక ఈ సినిమాలో చూపించిన కొన్నికొన్ని సీన్స్ విషయంలో ఇప్పటికి చాలా వరకు వివాదాలు అనేవి ఉన్నాయి. 

 

సినిమాలో చాలా వరకు కూడా ఒక కోణం మాత్రమే చూపించారు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని దేవుడు గా చేసే ప్రయత్నం చేసారు అని విమర్శలు చేసారు. ఈ సినిమాలో బాలయ్య కాస్త జాగ్రత్త తీసుకుంటే వివాదం అయ్యేది కాదు అని చాలా మంది కామెంట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు చాలా మంది కామెంట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: