టాలీవుడ్ లో ధ్రువ సినిమా  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ  రీమేక్ సినిమా అయినా సరే మన తెలుగు లో చాలా మంది ఆదరించారు ఈ సినిమాను. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అవ్వడమే కాదు రామ్ చరణ్ కి కూడా చాలా మంచి పేరు  తీసుకుని వచ్చింది. నటుడిగా రామ్ చరణ్ చాలా బాగా నటించాడు అని చాలా మంది అన్నారు. ఈ సినిమా చూసిన వారు చాలా మంది రామ్ చరణ్ నటనకు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. అతను ఆ విధంగా ఈ సినిమాలో నటించాడు అనే చెప్పవచ్చు. 

 

ఇక ఈ సినిమాలో చాలా వరకు సీన్స్  దర్శకుడు మాస్ ని క్లాస్ ని రెండు వర్గాలను టార్గెట్ చేసి చేసాడు. అయితే ఈ సినిమా కాస్త వివాదాలతో కూడా సావాసం చేసింది. రాజకీయాలకు సంబంధించి కొందరు సినిమా మీద విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయా అనే విధంగా ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చూపించారు అని అది మంచి పద్ధతి కాదు అని కొందరు కామెంట్ చేసారు. అదే విధంగా సినిమా హక్కుల మీద కూడా విమర్శలు వచ్చాయి. ఇక విలన్ అరవింద్ స్వామి మీద కూడా చాలా మంది విమర్శలు చేసారు. 

 

సినిమా సూపర్ హిట్ అయింది గాని వివాదాలే కాస్త చికాకు పెట్టాయి. ఇప్పుడు రామ్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనే ది కాస్త చెప్పడం కష్టమే అని కూడా అంటున్నారు మరి. సగం మాత్రమే సినిమా షూటింగ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: