మన తెలుగు లో చాల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేసాయి. అందులో స్టార్ హీరో ల సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాల్లు కూడా ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేసాయి అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా  సరే వివాదాలు మాత్రం సినిమాలను చాలా బాగా వెంటాడాయి అనే చెప్పాలి. టెంపర్ సినిమా విషయంలో దాదాపుగా అదే పరిస్థితి వచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో చాలా వివాదాలు వచ్చాయి. 

 

పోలీసులు అయితే తమను అవినీతి పరులు మాదిరిగా చూపించారు అని విమర్శలు చేసారు. అనాధలు గా పెరిగిన వారు అలా ఉంటారా అంటూ కామెంట్స్ చేసారు అదే విధంగా రేప్ సీన్స్ ని చూపించే విషయంలో కూడా దాదాపుగా వివాదం అయింది. ఇలా చాలా సీన్స్ అప్పుడు సినిమాలో తల నొప్పిగా మారాయి అనే చెప్పాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ సినిమాను మాత్రం వివాదాలు బాగానే చికాకు పెట్టాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఏకపక్షంగా వెళ్ళారు అని చాలా మంది విమర్శించారు అప్పుడు. 

 

సినిమా విషయంలో ఎన్టీఆర్ కూడా చాలా దూకుడుగా వెళ్ళారు  ఆ విధంగా పోలీసుల పాత్ర ను చూపిస్తే వారికి మనోభావాలు ఉంటాయి వారు కూడా బాధ పడే అవకాశం ఉంటుంది అని కనీసం గ్రహించలేదు అని చాలా మంది విమర్శించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మంచి వసూళ్లు కూడా ఈ సినిమా సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తారక్ చాలా వరకు కూడా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చాడు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నమే దాదాపుగా చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: