తెలుగు చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీలు సృష్టించిన సినిమాలు ఎన్నో... కొన్ని సినిమాలు కాంట్రవర్సీ లతోనే ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది మంచి విజయాలు కూడా అందుకున్నాయి. మరికొన్ని కాంట్రవర్సీ లతో తెరమీద కనిపించకుండా పోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఒకప్పుడైతే కొన్ని  సినిమాలకు  మాత్రమే కాంట్రవర్సీలు ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రతి సినిమా విషయంలో కాంట్రవర్సీ కామన్ అయ్యింది. ఏదో ఒక వివాదాన్ని తెరమీదకు తేవటం జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన  సినిమా విషయంలో కూడా కాంట్రవర్సీలు సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.



కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో  వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమా విషయంలో కూడా కాంట్రవర్సీలు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ నటించగా.. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే కంగనారనౌత్ క్రిష్ మధ్య వివాదాలు చెలరేగడంతో... ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల వరకు సినిమా షూటింగ్ కాస్త ఆగిపోయింది. దీంతో కంగనారనౌత్ ముందుకు వచ్చి దర్శకత్వ బాధ్యతలను స్వీకరించి ఈ సినిమాను పూర్తి చేసింది.



ఇక ఈ సినిమా విడుదలకు ముందు విడుదలకు తర్వాత క్రిష్ మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించిన వివాదం చిత్ర పరిశ్రమలో సంచలనం గా మారిపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఇక ఈ సినిమా క్రెడిట్ తనకే వస్తుందని క్రిష్... క్రిష్ మధ్యలో వదిలేస్తే బాధ్యతలు స్వీకరించి సినిమాను  పూర్తి చేశానని  ఈ సినిమా క్రెడిట్ తనకే వస్తుందని కంగనా.. ఇలా  మళ్లీ కాంట్రవర్సీ మొదలైంది . ఇలా ఈ సినిమా  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినప్పటికీ కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ సినిమా.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: