తెలుగు చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ సృష్టించే  సినిమాల గురించి మాట్లాడుకునే ముందు... కాంట్రవర్సి అనే పదానికి కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాంగోపాల్ వర్మ పేరు వింటే కాంట్రవర్సీ కూడా భయంతో వణికి పోతుంది. అంతలా కాంట్రవర్సీలు సృష్టిస్తూ  ఉంటారు రాంగోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనం గానే  మారిపోతూ ఉంటుంది. ఆయన తీసిన సినిమాలు... మాట్లాడిన మాటలు.. పెట్టిన పోస్టులు ఇవన్నీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సి అనే పేరు రాగానే అందరికీ రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తూ ఉంటాడు.


 అయితే ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు అన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వర్మ తెరకెక్కించిన సినిమాలలో ఏదైనా వివాదం లేదు అంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వివాదాలు లేని సినిమాలను వర్మ అసలు తెరకెక్కించరు కాబట్టి. ఆ సినిమా ఈ  సినిమా అని కాదు వర్మ తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా... కాంట్రవర్సీ లతో టాలీవుడ్ ను షేక్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో ఒకటి లక్ష్మీస్ ఎన్టీఆర్.



 నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కించాలని అనుకుంటున్నాను అని ప్రకటించిన వెంటనే.. తాను కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించబోతున్నాను  అని తన సినిమాలో అసలు నిజాలు చెప్పబోతున్నాను అంటూ ప్రకటన చేసి కాంట్రవర్సీ కి ఆజ్యం పోసాడు  రాంగోపాల్ వర్మ. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఒక్కో  విషయాన్ని బయట పెడుతూ.. మరింత కాంట్రవర్సీ సృష్టించారు. టిడిపి నేతలు ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు ఈ సినిమాను అడ్డుకునేందుకు కోర్టుకు సైతం వెళ్లేంతగా కాంట్రవర్సీ తో ఊపేసాడు రామ్ గోపాల్ వర్మ. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విడుదలై ఆశించినంత ఆదరణ పొందలేకపోయింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: