తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం కాంట్రవర్సీ లతో టాలీవుడ్ ను షేక్ చేస్తూ ఉంటాయి., ఈ మధ్య కాలంలో అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదం తెర మీదికి వచ్చి చిత్ర బృందాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ మధ్యకాలంలో సినిమాలపై వివాదాలు కాస్త కామన్ అయినప్పటికీ... కొన్ని సినిమాల వివాదాలు మాత్రం టాలీవుడ్లో సంచలనం గా మారిపోతూ ఉంటాయి. ఇలా కాంట్రవర్సీ తో టాలీవుడ్ ని ఊపేసిన  సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఈ సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది పెద్ద కాంట్రవర్సీ గానే మారిపోయింది. అయితే ఈ సినిమా యూత్ ని తెగ ఆకర్షించినప్పటికీ... పెద్దలకు మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఎందుకంటే అప్పటివరకూ తెలుగు సినిమాలో ఎక్కడా కనిపించని.. డీప్ రొమాన్స్.. లిప్ లాక్ సీన్లు.. ఈ సినిమాలో కనిపించాయి. అయితే ఈ సినిమా పై మరింత హైప్ తీసుకొచ్చేందుకు టీజర్ ట్రైలర్ లలో కూడా ఈ సినిమాలోని కొన్ని హాట్ లిప్ లాక్ సీన్స్ చూపించారు. దీంతో ఎన్నో సంఘాలు ఈ సినిమాను విడుదలను అడ్డుకుంటామని అంటూ సవాల్ చేశారు. ఇలాంటి సినిమాల కారణంగా యూత్ మొత్తం చెడిపోతారని... అంటూ ఆరోపణలు చేశారు. ఇలా అర్జున్ రెడ్డి సినిమా పై వచ్చిన కాంట్రవర్సీలు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం గా మారిపోయాయి. ఇక అన్ని కాంట్రవర్సీ లను దాటుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



 ఇక సినిమా విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా విషయంలో కాంట్రవర్సీలు ఆగలేదు. ఈ సినిమాను థియేటర్లలో బ్యాన్ చేయాలని.. సభ్య సమాజాన్ని  ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చెడు దారి పట్టించే ఎలా ఉన్నాయి అంటూ ఎంతో మంది ఆరోపణలు చేశారు. ఇక ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ సినిమా మాత్రం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించి... సంచలన విజయాన్ని అందుకొని విజయ్ దేవరకొండ ను  స్టార్ హీరోని చేసింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: