అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా జూన్ 23 2017 వ సంవత్సరం లో విడుదలైంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయిన తర్వాత ఆడియో లాంచ్ జరిగిన తర్వాత చాలా గొడవలు అయ్యాయి. ఎందుకంటే ఈ సినిమా లోని రెండవ పాట అయిన 'మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా' లిరిక్స్ లో హిందువులకు పవిత్రమైన రుద్రస్తోత్రం లో ఉపయోగించే మంత్రాలను అపహాస్యం చేశారని బ్రాహ్మణ సంఘాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మండిపడ్డాయి. ఈ పాట యూట్యూబ్ లో విడుదలయ్యి అప్పటికే 5 మిలియన్ల వ్యూస్ ని సంపాదించగా... బ్రాహ్మిన్స్ మీడియా ముందుకు వచ్చి తమ పవిత్రమైన మంత్రాలను హీరోయిన్ అందాన్ని పొగడడానికి ఉపయోగించారని, అలా చేయడం వల్ల తమ హిందువులను కించపరిచినట్లు అవుతుందని, స్టార్ హీరోల కూడా తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలు రూపొందిస్తున్నారని మండిపడ్డారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పవిత్ర బ్రాహ్మణుడి పాత్రలో నటించగా... ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన రోజు నుండే అనేక వివాదాలు తలెత్తాయి.


లిరిసిస్ట్ సాహితీ రాసిన రెండో పాట విడుదల కాగానే వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆలిండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ అయిన ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ కాలంలో చిత్ర నిర్మాతలు బ్రాహ్మణుల వర్గాన్ని చాలా నెగిటివ్ గా, కించపరిచేలా గా సినిమాలు రూపొందిస్తున్నారు. డీజే సినిమా వాళ్ళు శివుని పఠనం నుండి నమకం చమకం అనే పదజాలాన్ని ఉపయోగించి మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మేము దీన్ని అస్సలు ఒప్పుకోము. ఇది హిందువుల సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకం. ఇలా పవిత్రమైన మంత్రాలను తప్పుడు పదజాలంతో ఉపయోగించడం వలన దేవుళ్లను కించపరిచినట్టు అవుతుంది. చట్టపరంగా దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతాం' అని చెప్పుకొచ్చారు. సెన్సార్ బోర్డు కూడా బ్రాహ్మణుల వాదనకు సానుకూలంగా స్పందించింది.


దీంతో ఈ చిత్రానికి దర్శకుడైన హరీష్ శంకర్ మాట్లాడుతూ... నేను పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన వాడిని. నాకు భయం భక్తి దేవుడిపై నమ్మకం ఉన్నాయి. నా సినిమాలో నా మతం కులం గురించి తప్పుగా చూపించి నా మీద నేను ఉమ్మివేసుకోను. ఒకవేళ ఏదైనా కులాన్ని, మతాన్ని కించపరచేలగా ఉంటే వాటిని వెంటనే తొలగిస్తాను. హీరోని పవిత్రమైన బ్రాహ్మణుడిగా చూపించాను. మన బ్రాహ్మిన్స్ ని హీరోగా చూపించినందుకు గర్వపడాలి. లిరిక్స్ లో ఏదైనా తప్పు ఉంటే నేను మళ్ళీ ఇంకో లిరిక్స్ రాయిస్తాను', అని చెప్పుకొచ్చారు.


ఏదేమైనా మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా పాటలో కొన్ని మార్పులు చేసి డీజే సినిమా ని విడుదల చేశారు. కాగా ఈ సినిమా హిట్ టాక్ ని సంపాదించింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: