హీరో ప్రిన్స్, శ్రీవిద్య, రావు రమేష్, హాసిక, సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన బస్ స్టాప్ సినిమా అభ్యంతరకర సన్నివేశాలతో తెరకెక్కి అనేక వివాదాలకు దారితీసింది. అడల్ట్ కామెడీ, అసభ్యమైన పదజాలం, డబుల్ మీనింగ్ పదాలను బాగా నచ్చే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చింది. కానీ ఇతర ప్రజలు మాత్రం ఈ చిత్రం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా థియేటర్ల ముందుకు వచ్చి దిష్టి బొమ్మలు కాల్చి నిరసనలు చేపట్టారు. యువతను చెడు దారి పట్టించే ఇటువంటి సినిమాలను సెన్సార్ బోర్డు ఎలా విడుదలకు అనుమతి ఇచ్చిందని, ఈ సినిమాలకు ఎందుకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిందని విపరీతమైన ఆగ్రహంతో సెన్సార్ బోర్డు ఆఫీసు ముందుకు వెళ్లి పెద్ద నిరసనలకు పాల్పడినవారు చాలా మంది ఉన్నారు.


బస్ స్టాప్ చిత్రం లో డిగ్రీ విద్యార్థులు ప్రేమలో పడి, సంభోగం చేసుకొని, గర్భం దాల్చి మేము ఇలాగే ఎంజాయ్ చేస్తామంటూ తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఉంటారు. నేటి తరం యువత తల్లిదండ్రులు లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా తమ సుఖాలని తీర్చుకుంటున్నారని ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. దీంతో మంచిగా ఉన్న యువకులు కూడా ఈ సినిమాను చూసి చెడిపోతారని ఎస్ఎఫ్ఐ సంఘాలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి. కేవలం యువతను మాత్రమే ఆకట్టుకునే సన్నివేశాలతో బస్ స్టాప్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు మారుతీ బ్లాక్ బాస్టర్ హిట్ ని సాధించాడు.


నేటి సమాజంలో అమ్మాయిలు తమ ప్రయోజనాల కోసం ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో రొమాంటిక్ రిలేషన్ షిప్ పెట్టుకుంటున్నారని కూడా మారుతి ఈ సినిమాలో చూపించాడు. ప్రేమ విషయంలో తల్లిదండ్రులకు పిల్లలకు చోటుచేసుకునే సున్నితమైన అంశాన్ని కూడా మారుతీ టచ్ చేశాడు. చాలా వల్గర్ గా ఉన్న కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి వివాదాలు తెచ్చిపెట్టాయి. సినిమా చివరి లో ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు కానీ సినిమాలో చాలా వల్గారిటీ ఉండటం వలన మారుతికి చెడ్డ పేరు వచ్చింది. ఏదేమైనా నేటి యువత కి మంచి సినిమాలు అందించాలి కానీ ఎటువంటి వల్గారిటీ ఉన్న సినిమాలు అందించడం సరైంది కాదని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: