మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా  బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో పాటు కొన్ని కాంట్రవర్సిలు కూడా జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కొనిఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా   సినిమా ముందుకు వెళ్లాలన్న మాట. మాములుగా అయితే ఏదన్నా సినిమా ఈవెంట్ ఫంక్షన్స్ లో నటి నటులు ఏదన్నా మాట్లాడితే దానిలో తప్పులు వెతికి వాళ్ళని, వాళ్ళతో పాటు సినిమాకు వచ్చే పేరుని చెడగొట్టాలని చూస్తారు. ఇంకా అలా వివాదాస్పదంగా మాట్లాడిన నటుడిని మాములు రచ్చ చేయరుగా. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలా ఏదన్నా ఈవెంట్ లో మాట్లాడి కాంట్రవర్సి అయితే అది ఒక రకం..కానీ ఒక బడా హీరో నటించిన పెద్ద సినిమాలో ఒక పాటని కాంట్రవర్సి చేసి సినిమా మీద ఉన్న క్రెజ్ ని తగ్గించిన సందర్భాలు కూడా చాలా  ఉన్నాయి.

 

 

 

అలా కాంట్రవర్సి అయిన పాటలలో ఒకటి రచ్చ సినిమాలోని  "వాన వాన వెల్లువాయే" సాంగ్. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్. బి. చౌదరి ఈ సినిమాని నిర్మించారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మ్యూజికల్ గా బాగా మంచి  పెరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన' వాన వాన వెల్లువాయే' పాటను రీమిక్స్ చేసి రామ్ చరణ్ రచ్చ సినిమాలో వాడారు. అయితే ఈ వాన వాన వెల్లువాయె పాటను గౌతమ బుద్ధ విగ్రహం ముందు షూటింగ్ చేసారు.

 

 

 

అందుకని కొంత మంది మహిళ సంఘాలు ఇలా గౌతమ బుద్ధిని విగ్రహం ముందు అసహ్యంగా చిందులు వేయడం సరికాదని ఇది మన భారతీయ సంప్రదాయానికి అవమానం అని, ఈ పాట బుద్ధిని విగ్రహాన్ని కించపరుస్తుందని  కాంట్రవర్సి చేసారు.సినిమా రిలీజ్ ముందు బంజారా హిల్స్  పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసారు.. ఈ సినిమా లో నుంచి వాన వాన పాటని తీసేయమని జాతీయ అరుంధతి మహిళ శక్తి అనే మహిళ సంఘం వాళ్ళు  కాంట్రవర్సీ చేసారు. తర్వాత రచ్చ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలోని వాన వాన సాంగ్ బాగా హిట్ అయి మంచిది పెరు సంపాదించుకుంది.!

మరింత సమాచారం తెలుసుకోండి: