జూనియర్ ఎన్టీఆర్, పూజ హేగ్జె హీరో హీరోయిన్ గా నటించిన సినిమా అరవింద సామెత.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో  ఫ్యాక్షనిజాన్ని మరో కోణంలో చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు  యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. 'వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అంటూ సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటాయి.  హింస అనే పాయింట్‌తో మాటల మాంత్రికుడు తన శైలికి భిన్నంగా తెరకెక్కించిన కథే ‘అరవింద సమేత వీర రాఘవ'  సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది.

 

 

 

అలాగె సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సి గా కూడా మారింది. సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ పై రాయలసీమ వాసులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో తీశాడని, ఈ సినిమాలోని డైలాగ్స్ అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీసేయాలంటూ రాయలసీమ లోని కొంతమంది విమర్శలు చేసారు. ఈ సినిమాలో రాయలసీమ ప్రజలను బాగా రాటుతేలిన ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి చూపించారని కాంట్రవర్సికు తెరలేపారు. రాయలసీమ ప్రజలను రాక్షసులుగా, పగ సాధించడం కోసం ఎంతటివాడినైనా చంపడానికి వెనుకాడడు అన్న నేపథ్యంలో సినిమాని చిత్రీకరించారని కొంతమంది విమర్శించారు కూడా.

 

 

 

అలాగే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ డిలీట్ చేయకపోతే రాయలసీమలో అరవింద సామెత సినిమా  ప్రదర్శన అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి లీడర్స్ వ్యాఖ్యలు కూడా చేసారు. ఇలా రాయలసీమలో గొడవలు, కక్షలు గురించి సినిమాలో తప్పుగా చూపిస్తే అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కూడా అప్పట్లో కాంట్రవర్సి కూడా వచ్చింది.అలాగే రాయలసీమ ప్రాంతంలో  సినిమాలు తీయడానికి ఒక్క కొట్లాటలు, చంపుతాలూ తప్ప వేరే ఏమి లెవా?  రాయలసీమ కరువు ప్రాంతం, అలాగే రాయలసీమలో చాలామంది మేధావుల జీవిత చరిత్రల ఆదారంగా సినిమాలు తీయవచ్చు అని దర్శకుడికి తెలియచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అలా అరవింద సామెత సినిమా ఇన్ని కాంట్రవర్సిలను ఎదుర్కొని మంచి విజయాన్ని సాధించింది...

మరింత సమాచారం తెలుసుకోండి: