చిరంజీవి కెరీర్లో మాస్ సినిమాలే ఎక్కువ. చిరంజీవికి ఉన్న మెగాస్టార్ ఇమేజ్ అంతా మాస్ సినిమాల నుంచి వచ్చిందే. చిరంజీవి అంటే మాస్.. మాస్ అంటే చిరంజీవి అనేంతగా ఆయనకు పేరు. చిరంజీవి ఖైదీ చేసిన తర్వాత మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తే జనాలు ఆదరించని పరిస్థితి నెలకొంది. కానీ.. ఖైదీకి ముందు చిరంజీవి చేసిన క్లాసిక్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ‘శుభలేఖ’ ఒకటి. ఈ సినిమా విడుదలై 38 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా చిరంజీవిలోని నటుడ్ని వెలికితీసింది.

IHG

 

కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1982 జూలై 11న విడుదలైంది. సమకాలీన పరిస్థితులే ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాలోని కథాంశం ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ రిలేటెడ్ గా ఉండడం విశేషం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి 38ఏళ్ల క్రితమే చెప్పారు. ఎంత చదువుకున్నా ఉద్యోగమే ముఖ్యం అనే కాన్సెప్ట్ నేటి రోజుల్లో యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఇక వరకట్న సమస్య అప్పుడూ ఉంది.. ఇప్పుడూ ఉంది. మంచి కథాంశాన్ని తనదైన స్టైల్లో తెరకెక్కించి ఆకట్టుకున్నారు విశ్వనాద్. చిరంజీవి, సుమలత నటనలో పరిణితి చూపించడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

IHG

 

కథ, కథనాలకు గొల్లపూడి మారుతీరావు రాసిన మాటలు బలాన్ని చేకూర్చాయి. కేవీ మహదేవన్ సంగీతంలోని పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాలో చిరంజీవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. తొలిసారి తన నటనకు చిరంజీవి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. విశ్వనాధ్ కు కూడా ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. చిరంజీవి కెరీర్లో శతదినోత్సవ చిత్రంగా నిలిచిపోయింది. ప్రశాంతి క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, వి.వి శాస్త్రి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: