భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి... అందులో పాత తరం సినిమాలు ఎన్నో ఉన్నాయి.  ఇక 90వ దశకంలో దర్శకత్వంలో కొత్త దనం తీసుకు వస్తూ.. జాతీయ స్థాయిలో తీసిమాలు తీస్తూ అత్యాధునికతను జోడించి ఎన్నో హిట్ సినిమాలు తీశారు ప్రముఖ దర్శకులు మణిరత్నం.  సినీ పరిశ్రమలో మణిరత్నంతో ఒక్క సినిమా లో నటిస్తే చాలు అనుకునే స్టార్ ఎంతో మంది ఉన్నారు.  మణిరత్నం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా అప్పట్లోనే రోజా, ముంబాయి, దళపతి లాంటి సినిమాలు తీశాడు.  లవ్, రొమాంటిక్, థ్రిల్లర్, మాఫియా తరహా సినిమాలు తీశారు.  లవ్ ఎమోష్ లో మణిరత్నం సినిమాలు యమా క్రేజ్ ఉండేది. 

 

ఇక మణిరత్నం హృదయంలో నుంచి జాలువారిన ఓ గొప్ప మూవీ 'అంజలి'.   ఈ మూవీ 1990 లో విడుదలైనప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా రాణించినప్పటికీ.. పెద్దగా వసూళ్లు సాధించి ఉండకపోవచ్చు. అయినప్పటికీ.. మణిరత్నం 'అంజలి' అప్పటికీ.. ఇప్పటికీ.. ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటుండటం విశేషం.  మణిరత్నం  అప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. నాయగన్ , అగ్ని నాట్చాతిరామ్, గీతాంజలి వంటివే కాకుండా సామాజికాంశాలతో కూడిన సినిమా కూడా తీయగలనని మణిరత్నం నిరూపించారు.  మణిరత్నం హృదయంలో నుంచి జాలువారిన ఓ గొప్ప మూవీ 'అంజలి'.

 

మూవీ విడుదలై నేటికి 30 ఏండ్లు పూర్తయ్యాయి. మేధో వైకల్యం ఉన్న ఒక చిన్న అమ్మాయి కథను, ఆమె చుట్టూ అల్లుకున్న కుటుంబం, సమాజం దృక్పథం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పగలిగారు.  మేధో వైకల్యం ఉన్న పిల్లవాడిని పెంచడంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లను, అలాంటి పిల్లలతో వ్యవహరించడంలో పరిపక్వత, సున్నితత్వం .. ఇలా ఎన్నో విషయాలను అందంగా మనుసులకు హత్తుకునేలా స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకోవడం వల్లనే ఘన విజయం సాధించారని చెప్పవచ్చు.  ఈ మూవీలో  రఘువరన్, రేవతి, బేబీ షామిలి, మాస్టర్ తరుణ్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్శణ అని చెప్పుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: