రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను పూర్తిగా పక్కనపెట్టేశాడు. ప్రస్తతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను పట్టించుకోకుండా.. మహేశ్ గురించే ఆలోచిస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకొని.. మహేశ్ కోసం కథను రెడీ చేసేశాడు. మహేశ్ తో తీసే సినిమా కథ ఎంతవరకు వచ్చింది.. ఎలాంటి కథను ప్రిపేర్ చేశాడో తెలుసా.. 

 

రాజమౌళి దగ్గర స్క్రిప్టులు రెడీగా ఉండవు. తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పిన స్టోరీ లైన్స్ మాత్రమే మైండ్ లో ఉంటాయి. హీరో ఇమేజ్ కు తగ్గట్టు.. ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు వీటిలో ఒకదాన్ని ఎంచుకొని కథ డెవలెప్ చేస్తాడు. పూర్తిస్థాయి స్క్రిప్ట్ కోసం ఎనిమిది నెలల నుంచి ఏడాది పాటు సమయం తీసుకుంటాడు. కరోనా ఆర్ఆర్ఆర్ కు తీరని అన్యాయం చేసినా.. మహేశ్ మూవీకి మాత్రం న్యాయం చేసింది. ఈ కరోనా సెలవుల్లో మహేశ్ కథపై దృష్టి పెట్టిన రాజమౌళి.. స్క్రిప్ట్ వర్క్ ను దాదాపు పూర్తి చేశాడని తెలిసింది. 

 

మహేశ్ కోసం రాజమౌళి ఎలాంటి కథను ఎంచుకుంటాడన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ ఆడియో ఫంక్షన్ లో ఎలాంటి కథ కావాలో ఫ్యాన్స్ నే తేల్చుకోమన్నాడు జక్కన్న. మరి అభిమానులు ఏమి తేల్చుకోలేకపోయినా.. రాజమౌళి తనదైన స్టైల్లో ఎలాంటి కథను డిసైడ్ చేశాడో తెలియాల్సి ఉంది. 

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ నటించే సర్కారు వారి పాట సెట్స్ పైకి రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే లోపు.. సర్కారు వారి పాట పూర్తయితే.. రాజమౌళి మహేశ్ సినిమా మొదలు కావడానికి ఎక్కువ టైమ్ పట్టదు.

 

ఈ కరోనా టైమ్ లో బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది కాబట్టి.. గతంలోమాదిరి సినిమా సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకునే అవసరం లేకుండా.. వెంటనే మహేశ్ మూవీని మొదలుపెట్టేస్తాడు రాజమౌళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: