మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. సగానికి పైగా పూర్తైన ఈ సినిమా తర్వాత చిరు మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటిస్తారని తెలిసిందే. సాహో డైరక్టర్ సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి నటించిన మళయాళం మూవీ లూసిఫర్ సినిమా అక్కడ భారీ హిట్ అయ్యింది. అయితే సినిమాలో మోహన్ లాల్ పాత్రలో చిరు నటించే ఛాన్స్ ఉండగా పృధ్వి రాజ్ పాత్రలో ఎవరు చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

 

కొద్దిరోజులుగా తెలుగులో ఆ పాత్రని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు లూసిఫర్ ను మల్టీస్టారర్ సినిమాగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే లూసిఫర్ తెలుగు రీమేక్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న వార్తలపై విజయ్ టీం కొట్టిపారేసింది. అసలు విజయ్ కు ఆ సినిమా యూనిట్ నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని.. తను ప్రస్తుతం పూరి సినిమా మీదనే దృష్టి పెట్టాడని అంటున్నారు. విజయ్, పూరి కాంబోలో వస్తున్న ఫైటర్ సినిమా భారీ అంచనాలతో రాబోతుంది. 

 

ఫైటర్ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేశాడు పూరి. హిందిలో ఈ సినిమాను కరణ్ జోహార్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. చిరు సినిమాలో విజయ్ అనగానే లూసిఫర్ తెలుగు రీమేక్ పై సూపర్ బజ్ ఏర్పడింది. అయితే విజయ్ కు అనుకున్న ఆ పాత్రలో ఎవరిని తీసుకుంటారు. విజయ్ కి బదులుగా వేరే హీరో ఎవరైనా ఆ రోల్ లో నటిస్తారా లేక విజయ్ ఫైటర్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణా మెగాస్టార్ విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తే ఆ బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: