సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి, ఘట్టమనేని అభిమానులు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా విషయమై రాజమౌళి కూడా అనౌన్సుమెంట్ చేసారు. 

IHG's why <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DEEPIKA PADUKONE' target='_blank' title='deepika padukone-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>deepika padukone</a> thanked <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH BABU' target='_blank' title='mahesh babu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh babu</a> - Movies News

దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాని ఏ జానర్ లో తీస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహేష్ తో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరిసీతారామరాజు మాదిరిగా పేట్రియాటిక్ మూవీ తీస్తారా, లేదా మోసగాళ్లకు మోసగాడు మాదిరిగా కౌబాయ్ సినిమా తీస్తారా, లేదా జేమ్స్ బాండ్ తరహా సినిమా తీస్తారా అనేదాని పై మొన్నటివరకు చర్చలు జరుగసాగాయి. అయితే ఇటీవల వారంరోజులుగా పలు ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్, రాజమౌళి లో కాంబోలో తెరకెక్కబోయేది జేమ్స్ బాండ్ తరహాలో సాగే భారీ యాక్షన్ మూవీ అని అంటున్నారు. 

 

అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీయనుండడంతో హీరోయిన్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకొనే ఎక్కువ శాతం ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆమెను కనుక తీసుకుంటే అటు నార్త్ లో కూడా సినిమాకు మరింత హైప్ వస్తుందని రాజమౌళి ఆ విధంగా యోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం మహేష్, రాజమౌళి ల కాంబోలో భారీ రేంజ్ లో జేమ్స్ బాండ్ సినిమాతో ఆయన ఫ్యాన్స్ కు పెద్ద పండుగే....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: