దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయటానికి ఒప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమాని పవన్ చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో 'పింక్' సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IHG

దాదాపు రెండు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోకుండా ఉండటంతో, పైగా బాక్సాఫీస్ దగ్గర ఇతర హీరోల అభిమానుల హడావుడి పెరిగిపోవడం జరిగింది. ఇలాంటి సమయంలో చాల కలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న తరుణంలో 'వకీల్ సాబ్' ఎన్ని రికార్డులను పగలగొడుతుందో అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అయితే ఇండస్ట్రీ అభిమానుల కంటే ఈ సినిమాపై ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.

IHG

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొంచెం బ్యాలన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఏ మాత్రం పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీలో హిట్ కొడితే చాలు ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోవచ్చని, ఈ సినిమా రిజల్ట్ కోసం వేణు శ్రీరామ్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మరోపక్క ఈ సినిమా తర్వాత బన్నీతో 'ఐకాన్' అనే సినిమా ప్రాజెక్ట్ రెడీగా ఉంది. వరుసగా రెండు ప్రాజెక్ట్ లు పెద్ద హీరోలవి కావడంతో ఎలాగైనా ఈ మెగా హీరోలతో విజయాలు సాధించాలని మంచి పట్టుదల మీద ఉన్నాడట డైరెక్టర్ వేణు శ్రీరామ్.   

మరింత సమాచారం తెలుసుకోండి: