స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ గడ్డంతో కనిపించి అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళాడు. నిజానికి అల్లు అర్జున్ ప్రతి సినిమాకి కొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేస్తుంటాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లో మిలటరీ ఆఫీసర్ గా సరికొత్త లుక్ లో కనిపించి ప్రేక్షకులను బాగా అలరించాడు. దువ్వాడ జగన్నాథం-డీజే సినిమా లో పవిత్రమైన బ్రాహ్మణుడు అవతారం లో చాలా అందంగా కనిపించి ఆకట్టుకునే డైలాగులతో తన అభిమానులు ఎంతో అలరించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే రుద్రమ్మదేవి, సరైనోడు దేశముదురు, అల వైకుంఠపురములో సినిమాలలో విభిన్నంగా కనిపించి క్యారెక్టర్ కి న్యాయం చేయడం కోసం తాను తనని మార్చుకుంటూ... ప్రేక్షకులను అలరించడానికి ఎంతగా కష్టపడుతున్నాడో చెప్పకనే చెప్పేసాడు. పుష్ప సినిమాలో కూడా పొడవాటి గడ్డంతో కేక పుట్టించే లుక్ తో కనిపిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గడ్డాన్ని పెంచాడు. చిత్రీకరణ ప్రారంభం అయ్యే లోపు కరోనా వైరస్ భారతదేశంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరి ప్రణాళికలను సర్వనాశనం చేసింది.
దీంతో ఇంటికే పరిమితమైన ప్రముఖ హీరోలు ఖాళీగా కూర్చోవాల్సిన టైం వచ్చింది. తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి అల్లు అర్జున్ గత మూడు నెలలుగా వేచిచూస్తూనే ఉన్నాడు. గడ్డం ట్రిమ్ చేస్తే మళ్ళీ పెంచడానికి అవసరంగా సమయం తీసుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో తన గడ్డాన్ని అలాగే మెయింటెన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
తాజాగా అతను హైదరాబాద్ శివార్లలో తన కారు నుండి దిగి మార్నింగ్ వాక్ కు వెళ్తున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలో అల్లు అర్జున్ జుట్టు, గడ్డం బాగా పెంచేసి కనిపించాడు. మూడు నెలల పాటు గడ్డం జుట్టు పెంచుతున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం ఇప్పట్లో ప్రారంభం అవుతుందో లేదో తెలియక ఇప్పటికైనా ట్రిమ్ చేయించుకోవాలని యోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాల నుండి టాక్. ఏదేమైనా మహమ్మారి కరోనా వైరస్ వలన ప్రతి ఒక్కరూ నానారకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అల్లు అర్జున్ మాత్రం తన పొడవాటి గడ్డంతో బాధపడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: